తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా, చీరాల పట్టణం నందు కామధేను కాంప్లెక్స్ దగ్గర ఆయన విగ్రహానికి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఏకైక ధృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ పోరాటం...
నిమ్మనపల్లె మండలంలో దళితుల భూములను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శ్రీ చందు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, నిమ్మనపల్లె తహశీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి దళితుల భూములను ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు. అధికారుల అండతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్...
హైదరాబాద్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మెల్లగా బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా పార్టీ వర్గాల్లో కొనసాగుతున్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తోంది. సీనియర్ నేతల అసహనం, కొందరు ఎమ్మెల్యేల రహస్య భేటీలతో గాంధీభవన్‌లో రాజకీయ చర్చలు వేడెక్కాయి.
జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత టి. జీవన్ రెడ్డి పార్టీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం...
బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకన నూతన ప్రింట్ ఆన్ షాపును ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్‌ను కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా కాలనీలలో పెరుగుతున్న దోమల సమస్యపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.
పలు కాలనీల్లో దోమల సమస్య తీవ్రంగా పెరుగుతోందని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ముఖ్యంగా ఫాగింగ్...
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ముగింపు వేడుకలు రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశి కిరణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించడమే కాక, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, మద్య పాన నిషేధం కోసం నిరాహార దీక్ష చేసి, గ్రామీన...
మదనపల్లె కలెక్టరేట్ వద్ద సోమవారం గోళ్లపల్లికి చెందిన రాజమ్మ తన దివ్యాంగుడైన కుమారుడు మనోహర్ (35)తో కలిసి నిరసన తెలిపారు. మనోహర్‌కు ప్రస్తుతం నెలకు రూ. 6 వేల పింఛన్ వస్తోంది. అతని వైకల్య తీవ్రత దృష్ట్యా రూ. 15 వేల పింఛన్‌కు అర్హుడైనప్పటికీ, అధికారులు పట్టించుకోవడం లేదని రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగలేదని, ఉన్నతాధికారులు స్పందించాలని ఆమె మీడియా...
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, ఆన్లైన్ మోసాలపై బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, బాధితులకు...
మదనపల్లె పట్టణంలోని మడికయల శివాలయానికి చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 41 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు రెడ్డి సంఘం పేరుతో అక్రమంగా కబ్జా చేశారని ఆలయ కమిటీ సభ్యులు సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ (PGRS) లో ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డీఆర్వో, విచారణ జరిపి ఆలయ భూమిని పరిరక్షించాలని అధికారులను...
గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.