Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
    శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ మార్గం ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది, కానీ అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఏ వాహనం అటుగా రాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. అయితే, ఈ సంఘటన వలన ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది# కొత్తూరు మురళి.
    283 Views
  • *జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు*
    సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా పోలీస్ అధికారులు, విద్యార్థినులతో కలిసి సీసీఎస్ డీఎస్పీ గారు రిబ్బన్ కత్తిరించి...
    523 Views
  • అనారోగ్యంతో విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి శాసనమండలికి వచ్చిన బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా పలకరించారు. సభలో కలిసిన సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. త్వరగా కోలుకుని ప్రజా సేవలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు.
    #Boiena Rajesh
    6 Views 973 Views
  • మరోసారి బొత్సకు అస్వస్థత
    శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యు లను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. #B RAJESH 
    343 Views
  • చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో డెడ్ బాడీ కలకలం
    చీపురుపల్లి రైల్వేస్టేషన్ శివారున రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ మధు సూదనరావు శుక్రవారం తెలిపారు. డెడ్ బాడీ నుంచి దుర్వాసన వస్తోందని, కుళ్లే స్థితికి చేరుకుండడంతో మూడు రోజుల క్రితం ప్రమాదం జరగవచ్చన్నారు. మృతుడు గల్ల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని, చేతిపై ఓ పచ్చబొట్టు ఉందన్నారు. గుర్తించిన వారు జీఆర్పీ స్టేషన్ను సంప్రదించాలన్నారు. #Boiena Rajesh
    350 Views
  • ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
    తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ పరిశుభ్రత సమైన్యంగా నిర్వహణ మరియు పరిపాలన సామర్థ్యంపై ప్రత్యేక డ్రైవ్ 06-03-2026 నుండి17-3-2026 వరకు సూచనలు జారీ చేయడం ఈ కార్యక్రమం భాగంగా గ్రామంలో  ప్రాథమిక పాఠశాల ప్యారా వరం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది  A. Srinivas 
    1.1K Views
  • విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
    విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు   రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి,మంచిర్యాల జోన్ పరిధిలో పిల్లల భద్రత,సంరక్షణతో పాటు మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్ మరియు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలను పోలీస్ అధికారులు ఈ రోజు...
    385 Views
  • Maala Employees coordination committee
    రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టినందున, ఉద్యోగులంతా ఈ 99 రోజుల కార్యాచరణను ఒక దీక్షలా చేస్తే పేదలందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేసిన వారవుతారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేలు చేయడానికే ప్రభుత్వం...
    239 Views
  • మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ
    ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యాలయం.  సమయం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు అధికారులతో సమీక్ష, అనంతరం 10 గంటల నుండి ప్రజల నుండి అర్జీల స్వీకరణ ఉంటుంది. సోమవారం...
    Like
    1
    732 Views