Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే ధ్యేయంగా తిరుమలగిరిలో హెల్మెట్ బ్యాంక్ ప్రారంభం .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్  అవినాష్ మహంతి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో "హెల్మెట్ బ్యాంక్" (Helmet Bank) కార్యక్రమాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని...
    284 Views
  • నగర రోడ్లపై ప్రమాదకరంగా మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు - ఆందోళనలో వాహనదారులు
    చీరాల పట్టణం లో రద్దీగా ఉండే నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న భారీ వాహనాలు సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఒక ట్రాక్టర్ ట్రాలీ నిండుగా, ఎటువంటి రక్షణ కవచం తార్పాలిన్ వంటివి లేకుండా మట్టి, రాళ్లను తరలిస్తూ కనిపించింది. ట్రాలీలో మట్టిని దాని సామర్థ్యం కంటే ఎక్కువగా నింపడం వల్ల, ప్రయాణంలో ఆ మట్టి రోడ్డుపై పడే అవకాశం ఉంది. దీనివల్ల వెనుక వచ్చే ద్విచక్ర...
    611 Views
  • పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
    చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పుంగనూరుకు జింక చలపతి, పూతలపట్టుకు బాబాజాన్, కుప్పంకు మొగసాల కృష్ణమూర్తి, పలమనేరుకు వెంకటరెడ్డి యాదవ్, చిత్తూరుకు మొగసాల రెడ్డప్ప, నగరికి రాహుల్ రాజారెడ్డి, జీడి నెల్లూరుకు వల్లివేడు పృథ్వీ రెడ్డిలను పరిశీలకులుగా నియమించారు. ఈ నియామకాలు పార్టీ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా...
    288 Views
  • పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం వైసిపి రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసిపిలో చేరాయి. బూరగమంద క్రాస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం శ్రమించే వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి...
    301 Views
  • *చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం*
    జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎండి.మోయిన్ సూచనలతో మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చీరాల 1టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం 'ఓపెన్ హౌస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సిఐ ఎస్. సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పోలీస్ స్టేషన్ పనితీరు,ప్రజలకు పోలీసులు అందించే సేవలను క్షేత్రస్థాయిలో...
    648 Views
  • పుంగనూరు నియోజకవర్గం : ఆ పాఠశాల ప్రవేశానికి ఈ నెల 12 వరకు గడువు
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 12 వరకు పొడగించినట్లు ప్రిన్సిపల్ జయసింహ నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హత ఉన్న విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు https: //mjpapbcwreis. apcfss. in సందర్శించాలని సూచించారు. గురుకులంలో పలు వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు# కొత్తూరు...
    259 Views
  • పుంగనూరు నియోజకవర్గం : పాపం చిన్న పాపమ్మ
    పుంగనూరు నియోజకవర్గం, సదుం విద్య వనరుల కేంద్రం వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ (90) దయనీయ స్థితిలో జీవిస్తున్నారు. ఓటర్ ఐడి ఉన్నప్పటికీ, రేషన్, ఆధార్ కార్డులు లేకపోవడంతో ఆమెకు పింఛన్ అందడం లేదు. ఎవరైనా పెట్టే తిండి తింటూ ఇబ్బందులు పడుతున్న ఆమె, పింఛన్ మంజూరు చేస్తే ఎంతో సహాయకరంగా ఉంటుందని శుక్రవారం వేడుకున్నారు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు# కొత్తూరు...
    338 Views
  • పుంగనూరు నియోజకవర్గం :గడ్డి లోడ్ లారీకి అగ్నిప్రమాదం
    సోమల మండలం, కందూర్ గ్రామంలో గడ్డి తరలిస్తున్న లారీకి భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరగకుండా మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు తన సొంత జెసిపి సాయంతో లారీని పక్కనే ఉన్న బసినాయన చెరువులోకి తీసుకెళ్లి, అందులోని గడ్డిని చెరువులో పడేశాడు. చెరువు ఉండటంతో లారీ భారీ అగ్నిప్రమాదం నుండి బయటపడింది. లారీ యజమాని శ్రీనివాసులుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు# తురుమురళి.
    347 Views
  • పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
    పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు ప్రజాధర్బార్ నిర్వహించారు. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని చల్లా బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    294 Views
  • పుంగనూరు: శుభారాం ప్రభుత్వడిగ్రీ కళాశాల వద్ద అగ్ని ప్రమాదం
    పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలేజీ ఆవరణలో పేరుకుపోయిన చెత్త, కంచె మంటల్లో చిక్కుకోవడంతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ ఘటనకు గల పూర్తి కారణాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    316 Views