Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలిశారు. కాలనీలో ఎదుర్కొంటున్న పలు పౌర సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.    ప్రధానంగా వీధి దీపాల నిర్వహణ, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మల ప్రూనింగ్, విద్యుత్ సరఫరా మెరుగుదలకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, పార్కు సుందరీకరణ మరియు...
    323 Views
  • మదనపల్లి: కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు.
    మదనపల్లి మండలంలో ఆదివారం, ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా అమర్చేందుకు వెళ్లినప్పుడు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయిన ఆయనను స్థానికులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
    305 Views
  • మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్‌కు 53 మెట్రిక్ టన్నుల టమోటాలు దిగుమతి అయ్యాయి. మేలు రకం టమోటాలు 10 కిలోలకు రూ. 125, రెండో రకం రూ. 100, మూడో రకం రూ. 90 ధర పలుకుతున్నాయి. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు.
    278 Views
  • Raghurama Krishnam Raju: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు: రఘురామకృష్ణరాజు.
    ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో గాయపడిన రఘురామకృష్ణరాజు ఎడమ చేతి మణికట్టుకు శస్త్రచికిత్స ఫోన్‌లో ఆరోగ్య పరిస్థితిని విచారించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వారికి ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను గాయం నుంచి కోలుకుంటున్న...
    365 Views
  • పుంగనూరు: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, గొంగివారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. దివ్యాంగుడైన ఎస్. రమేష్ ఇంటికి వెళ్లి ఆయన పింఛన్ అందజేశారు. అనంతరం పింఛన్ల పంపిణీని పరిశీలించి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో నాగరాజు, సోమల ఏఎంసీ చైర్మన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
    284 Views
  • పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు.

    ✳️ యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసిన పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

    ✳️ తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

    ✳️ గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

    ✳️ భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జైశంకర్ గారిని విజ్ఞప్తి చేశారు.
    105 Views
  • పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    299 Views
  • పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    285 Views
  • NZB. ఈ నేల 7న చలో ఇందిరా పార్క్
    2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వా మెమో 57 అధరంగ హైకోర్ట్ తిర్పును అమలు చేస్తు పత పెన్షాన్ విధానాన్ని వర్తింపజేయాలని పోరాట సమితి రాష్ట్రాధ్యక్షుడు మాడవేడీ వినోద్ కుమార్ డిమాండ్ చేషారు.దేశమ్‌లోని సగం రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ మెమోను అనుసృస్తు పత పెన్షాన్ విధానాని  తమా ఉద్యోలకు వర్తింపజేష నానారు.ఇందులోభాగంగా మార్చ్7 నా చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ విజయవంతం చేయాలన్నారు 
    326 Views
  • Telangana CM Revanth Reddy has expressed concern over the safety of Telugu people in Gulf countries amid rising tensions after US-Israel attacks on Iran. He urged everyone to stay alert and follow advisories issued by Indian embassies and local authorities. Officials have been directed to stay in constant touch with the Centre.
    @S.Azhar Alam
    #telangana #india #revanthreddyanumula #cm
    2.8K Views