ఎంతో ప్రతిష్టత్మాక చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు, హైవే రోడ్డుఫై చేపట్టిన బ్రిడ్జ్ పనులు నత్తనడకగా సాగుతున్నాయి... దీనవలన రోడ్డుఫై పనులు సంబందించిన సామాగ్రి అక్కడికక్కడే ఉంచడం వల్ల వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తేలెత్తున్నాయి... గత దశబ్దాలు కాలం నుండి ఈ పోలవరం పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి... అనేక ప్రభుత్వాలు మారిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయలేక పోతున్నారు.. ఇప్పటికైనా...
బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి భక్తులతో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. తడువాయి దాటిన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకరపు మలుపు వద్ద ఏకరణ చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శీతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స...
ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి కల్పనా కుమారి గారికి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు – సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.
బల్లికురవ పోలీసులు చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్లో, ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల పరిధిలో గ్రానైట్ ఫ్యాక్టరీ లలో, పొలాల్లోని ట్రాన్స్-ఫార్మర్లు మరియు కాలేజీ బిల్డింగ్ లోని రాగివైర్లు దొంగిలించిన ఐదుగురు...
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
👉పెండింగ్ కేసులలో దర్యాప్తును వేగవంతం చేసి, కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి:జిల్లా ఎస్పీ గారు.
👉ప్రాపర్టీ నేరాలను కట్టడి చేస్తూ రికవరీ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.
👉రోడ్డు ప్రమాదాల...
మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా డ్యూటీ హెడ్ నర్స్ బయటకు గెంటేస్తోందని బాధితులు మంగళవారం రాత్రి ఆరోపించారు. ప్రసవ నొప్పులతో వచ్చిన మహిళల అటెండర్లను రాత్రి 11 గంటల సమయంలో బయటకు పంపడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత నెల ఇదే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో, హెడ్ నర్స్ చర్యలు వివాదాస్పదమయ్యాయి. బాధితులు జిల్లా...
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం, బోయకొండ యానాదిపాలెం గ్రామానికి చెందిన లేట్ పాపిరెడ్డి భార్య గంగులమ్మపై అదే కాలనీకి చెందిన నాగరాజు మంగళవారం కొడవలితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గంగులమ్మ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, సూక్ష్మ నీటిపారుదల, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ-క్రాప్ బుకింగ్, సీసీఆర్సీ కార్డులు, భూసార పరీక్షల లక్ష్యాలను పూర్తి చేయాలని, యూరియా కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన పెంచి వాటి వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయంలో...
మదనపల్లి పట్టణానికి చెందిన ఆర్. రెడ్డప్ప (40) మంగళవారం బొమ్మచెరువు సమీపంలోని దానిమ్మ తోటలో కూలి పనులు చేస్తుండగా నాగుపాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి చెందిన రైతు వెంకటరెడ్డి (46) తీవ్రంగా గాయపడ్డాడు. సీటీఎం గంగ జాతర చూసుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, మదనపల్లి మీదుగా వెళ్తున్నప్పుడు తట్టివారిపల్లి బైపాస్ వద్ద ఖుషి డాబా సమీపంలో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.