మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఐదు సంవత్సరాల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రిన్సిపాల్ బి. వెంకన్న గారిని కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది.
గత ఐదేళ్లుగా కళాశాల అభివృద్ధిలో, విద్యార్థుల క్రమశిక్షణ మరియు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో వెంకన్న గారు విశేష కృషి చేశారని అధ్యాపకులు కొనియాడారు....
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వక్తలు రక్తదానంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిబిరంలో మొత్తం 35 యూనిట్ల రక్తం సేకరించబడింది# కొత్తూరు మురళి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి అందులోని ఫోన్ పే ద్వారా అక్షరాల 8 లక్షల రూపాయలు దొంగిలించుకున్న దొంగను సూరారం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి రూ. 6.73 లక్షల నగదు తో పాటు దొంగలించిన మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సూరారం ఎస్ హెచ్ ఓ సుధీర్ కృష్ణ తెలిపిన ఘటన వివరాలు:
జనవరి 07- 2026...
బాపట్ల: అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్ల కి కనీసవేతనాలు అమలుచేయాలి, దేశవ్యాప్తంగా బడ్జెట్ పెంపుదల చేయాలి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా బాపట్ల ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద నిరసన..12వ తేదీ సమ్మెలో అంగన్వాడీలుజయప్రదంచేయాలి.సిఐటియు బాపట్ల జిల్లా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి రేఖ ఎలిజిబెత్
అంగన్వాడీల వేతనాలు పెంపుదల కోసం ప్రాజెక్ట్ కార్యాలయాలు వద్ద ఆందోళనలు...
బాపట్ల జిల్లా: ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్ టెక్నీషియన్లది అత్యంత కీలకమైన పాత్ర అని బాపట్ల జిల్లా డిఎంహెచ్వో శ్రీమతి డాక్టర్ విజయమ్మ అన్నారు. ఈరోజు స్థానిక బాపట్ల ఎన్జీవో హోమ్ లో జరిగిన బాపట్ల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్లు మరియు సబ్ యూనిట్ అధికారుల నెలవారి మలేరియా సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయమ్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య...
పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో S.F.S స్కూల్ మెయిన్ రోడ్డును కొత్తగా నిర్మించిన హైవే కారణంగా వినియోగించకపోవడంతో, ఆ ప్రాంతం పూర్తిగా చెత్తకుప్పగా మారింది. రోడ్డు మీదే మల–మూత్ర విసర్జనలు జరుగుతుండటంతో ఆ ప్రాంతం దుర్గంధంతో డంపింగ్ యార్డ్‌ను తలపించే పరిస్థితి ఏర్పడింది.ఈ రహదారిని ప్రతిరోజూ S.F.S స్కూల్‌కు వెళ్లే చిన్నారులు నడక మార్గంగా వినియోగించాల్సి రావడంతో, చెత్త...
వేటపాలెం: తండ్రి మందలించాడనే కోపంతో వేటపాలెం కు చెందిన గుత్తి సిద్ధార్థ అనే బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయాడని ఎస్సై జనార్ధన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరికైనా అతడి ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈరోజు సాయంత్రం వాళ్ల చెల్లిని స్కూలు దగ్గర దించడానికి వెళ్లి వాళ్ళ నాన్నగారు మందలించాడని కోపంతో అలిగి సైకిల్ పై ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయినాడు.
తప్పిపోయిన బాలుడు...
APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న హుస్సేన్ గారి కుమార్తె రిజ్వానా APPSC గ్రూప్–1 ఫలితాలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా...
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు
👉ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ గారు
పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తుమ్మల సింగయ్య HC.1906, 36...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన మంగళవారం రాత్రి చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు చౌడేపల్లి , పుంగనూరు ప్రధాన రహదారిలో చౌడేపల్లి వైపు వస్తున్న టూవీలర్ అదుపుతప్పి కిందకు పడింది. ఈ ప్రమాదంలో బూరుగు పలికి చెందిన దేవరాజులు( 50) నవీన్( 25) లకు గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .