Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిన్న ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు (సూరన్న)తో కలిసి కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
    106 Views
  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ..

    నర్సింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పోచారం

    బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ పట్టణానికి చెందిన 31 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అందజేశారు.

    ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు పాల్గొన్నారు.

    అనంతరం బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులతో కలిసి పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు

    ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
    106 Views
  • బైరాపూర్‌లో కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం*
    మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కొత్త ఓటర్ నమోదు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) వేణు మాట్లాడుతూ.. గ్రామంలో Form-6 కింద మూడు కొత్త దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సమ్మరీ రివిజన్ నడుస్తోందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకులు తప్పనిసరిగా ఓటర్‌గా నమోదు చేసుకోవాలని సూచించారు.ఓటర్ జాబితాలో పేరు...
    109 Views
  • పలాస మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మకు వైఎస్సార్‌సిపి అవకాశం
    పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి తాళాసు శ్రీపద్మను ఎంపిక చేయడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ పి.వి. సతీష్ సతీమణి అయిన శ్రీపద్మ ఉన్నత విద్యావంతురాలు, సుగుణశీలి, ప్రజా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు నాయకులు పేర్కొన్నారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకత్వ...
    149 Views
  • అంకాపూర్ లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సిపి సాయి చైతన్య, IPS గారు 60 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి, స్వయంగా భోజనం వడ్డించారు. వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు
    105 Views
  • నాణ్యతా ప్రమాణాలు పాటించాలి మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్
    ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు పొట్టి శ్రీరాములు చౌక్ సమీపంలో జరుగుతున్న సీసీ డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులను గురువారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణ లతో కలిసి వారు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా వారు నిర్మాణ పనులను...
    158 Views
  • నిజామాబాద్‌: సూర్య సామైక్య సంఘం ఆధ్వర్యంలో దేవీమాత పల్లకి ఊరేగింపు
     సూర్య సామైక్య సంఘం ఆధ్వర్యంలో దేవీమాత పల్లకి ఊరేగింపును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని పూలమాలలతో అలంకరించి పల్లకిపై ప్రతిష్ఠించి ఊరేగించారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిగీతాల ఆలాపన, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య పల్లకి ఊరేగింపు కొనసాగింది.
    124 Views
  • హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కకు కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.

    ఈ సందర్భంగా ఏర్గట్ల మండల పరిధిలోని తడపాకల్, గుమ్మిర్యాల్, దోంచంద గ్రామాల్లో పుష్కర ఘాట్లకు అదనపు ఘాట్లు నిర్మించడంతో పాటు, మరమ్మతుల కోసం అదనపు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. తడపాకల్ గ్రామం నుంచి పుష్కర ఘాట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రికి వివరించడం జరిగింది.
    ఇప్పటికే NH - 16 నుండి తడపాకల్ పుష్కర ఘాట్ వరకు రెండు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు

    అలాగే ఏర్గట్ల మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న తాళ్లరాంపూర్ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, పాలెం నుంచి ఏర్గట్ల వరకు తొర్తి మీదుగా డబుల్ బీటీ రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

    ఈ అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు, పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలియజేయడం జరిగింది
    122 Views
  • డీజీపీ సమీక్ష.. కీలక కేసుల ఛేదనపై అభినందనలు.|
    ● 17 సంచలనాత్మక కేసుల ఛేదనపై డీజీపీ ప్రశంసలు ● చిన్నారి కిడ్నాప్‌, హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు ● నేరాల దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్రోలింగ్‌పై సమీక్ష అల్వాల్,అక్టోబర్15:మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నమోదైన 17 సంచలనాత్మక, కీలక కేసులన్నింటినీ ఛేదించిన పోలీసుల పనితీరును తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌, ఐపీఎస్‌ ప్రశంసించారు....
    173 Views
  • ప్రజాస్వామ్య గొంతుకల అణచివేత పై జగన్ నిలదీయుతకు జ్యోతిబాపూలే అధ్యక్షుడు ప్రసాద్ నాయుడు మద్దతు
     న్యూఢిల్లీ.  అశుతోష్ రాంకా మరియు సౌరవ్ దాస్ అరెస్టుల వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను కలవరపరుస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై బలంగా గళం విప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జ్యోతి బా ఫూలే ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు.భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా జరుగుతున్న అరెస్టులు, రాజ్యాంగ సంస్థల...
    186 Views