Bharat Aawaz
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ..

నర్సింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పోచారం

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ పట్టణానికి చెందిన 31 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు పాల్గొన్నారు.

అనంతరం బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులతో కలిసి పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు

ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
105 Views