Bharat Aawaz
హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కకు కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్గట్ల మండల పరిధిలోని తడపాకల్, గుమ్మిర్యాల్, దోంచంద గ్రామాల్లో పుష్కర ఘాట్లకు అదనపు ఘాట్లు నిర్మించడంతో పాటు, మరమ్మతుల కోసం అదనపు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. తడపాకల్ గ్రామం నుంచి పుష్కర ఘాట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రికి వివరించడం జరిగింది.
ఇప్పటికే NH - 16 నుండి తడపాకల్ పుష్కర ఘాట్ వరకు రెండు కోట్ల యాభై లక్షల నిధులు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు

అలాగే ఏర్గట్ల మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న తాళ్లరాంపూర్ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, పాలెం నుంచి ఏర్గట్ల వరకు తొర్తి మీదుగా డబుల్ బీటీ రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు, పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలియజేయడం జరిగింది
121 Views