Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రేగడి జోష్ణప్రియ దొంతి వీధిలోని రిటర్నింగ్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు.
    మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డు జనరల్ మహిళకు కేటాయించడంతో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రేగడి జోష్ణప్రియ మదనపల్లె దొంతి వీధిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సోదరుడు, ఆల్ ఇండియా కాపు, బలిజ, తెలగ, ఒంటరి రాయలసీమ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు మద్దతుగా నిలిచి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సందర్భంగా జోష్ణప్రియ మాట్లాడుతూ.. 30వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి...
    130 Views
  • Madanapalle: మదనపల్లెలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
    మదనపల్లె: మదనపల్లెలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పట్టణంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.    
    129 Views
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ.
    తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు చేరుకుంది.   ఈ ఉదయం 8 గంటల సమయానికి క్యూలో ఉన్న భక్తులకు స్వామివారి సర్వదర్శనం...
    133 Views
  • రమ్యను గెలిపించుకోండి పలాస అభివృద్ధిని సాధించుకోండి
    పలాస: పలాస మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా తన సతీమణి మన్యాల రమ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని మన్యాల శ్రీనివాస్ యాదవ్ పలాస ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రమ్యతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన, విలువలతో కూడిన రాజకీయాల కోసం తమను ఆశీర్వదించాలని కోరారు. కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న తీరు, పార్టీకి అందించిన సేవలు అందరికీ తెలిసినవేనని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి...
    506 Views
  • 14వ వార్డు కౌన్సిలర్‌గా మళ్లీ గెలిపించండి: బెల్లాల శ్రీనివాసరావు విజ్ఞప్తి
    పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరపున బెల్లాల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే వార్డుకు కౌన్సిలర్‌గా సేవలందించిన ఆయన, ఈసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వార్డులోని ఓటర్లందరూ వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కౌన్సిలర్‌గా...
    412 Views

  • 18.10.2028
    నిజామాబాద్.

    పండుగల వేళ ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దు.. రైల్వే బ్రిడ్జి ట్రాఫిక్ డైవర్షన్‌ను దీపావళి వరకు వాయిదా వేయాలి

    నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్

    నిజామాబాద్ నగరంలోని విజయ టాకీస్ పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా ఈరోజు నుంచి అమలు చేస్తున్న ట్రాఫిక్ డైవర్షన్‌ను దీపావళి పండుగ వరకు వాయిదా వేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.

    దసరా పండుగకు కేవలం మూడు రోజుల ముందు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో నిజామాబాద్‌కు వచ్చి పండుగ కొనుగోళ్లు చేస్తుంటారని తెలిపారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం ప్రజలకు మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

    ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా వ్యాపారులు, చిరు వ్యాపారులు, వాహనదారులు, పండుగ కొనుగోళ్ల కోసం వచ్చే కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. పండుగల సమయంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

    అభివృద్ధి పనులకు మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలి అని గణేష్ బిగాల స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, రైల్వే శాఖ అధికారులు సమన్వయంతో చర్చించి, దసరా మరియు దీపావళి పండుగలు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్‌ను వాయిదా వేయడంతో పాటు, బ్రిడ్జి విస్తరణ పనుల విషయంలో తగిన ప్రణాళిక రూపొందించాలని కోరారు.

    ప్రజల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని, పండుగల సమయంలో ప్రజలను ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులకు గురిచేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గణేష్ బిగాల డిమాండ్ చేశారు.
    134 Views
  • తెనాలిలో నేడు(2వ రోజు)నామినేషన్ల జోరు
    తెనాలి. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నామినేషన్ కోలాహాలు నెలకొననుంది. ఈ రెండు రోజుల్లో వైసీపీకి చెందిన అభ్యర్థులు 25 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా 27 మంది కౌన్సిలర్లు,ఒక చైర్మన్ అభ్యర్థి నామినేషన్లు వేయాల్సి ఉన్నది. కూటమి తరఫున 52 మంది కౌన్సిలర్స్ అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి కూడా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
    161 Views
  • తెనాలిలో సీట్ల సర్దుబాటు ఖరారు. మునిసిపల్ ఎన్నికలు....
    తెనాలిలో మునిసిపల్ ఎన్నికల టిడిపి అభ్యర్థుల జాబితా విడుదలైంది.మొత్తం 52 వార్డులకు గాను కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది.జనసేనకు 20,బీజేపీకి 1, మిగిలిన 31 వార్డుల్లో టిడిపి పోటీ చేస్తుంది. ఇప్పటికే పలు వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించారు.30, 48 వార్డుల అభ్యర్థుల పేర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.
    187 Views
  • బతుకమ్మా పండుగ సంబరాలు
    మిర్యాలగూడ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం *గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి (BLR) గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ* వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను *డీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ చిలుకూరి బాలకృష్ణ గారు* సందర్శించి పరిశీలించారు.   ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, వేడుకలు సజావుగా నిర్వహించేందుకు జరుగుతున్న పనులను...
    161 Views