Bharat Aawaz

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ.

Pagadala Venkateswar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
97
Views

తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు చేరుకుంది.

 

ఈ ఉదయం 8 గంటల సమయానికి క్యూలో ఉన్న భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 నుంచి 13 గంటల సమయం పట్టవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలో వేచి ఉన్న వారికి టీటీడీ సిబ్బంది తాగునీరు, అన్నప్రసాదాలను నిరంతరం పంపిణీ చేస్తూ తగిన ఏర్పాట్లు చేశారు.

 

నిన్న (శనివారం) శ్రీవారిని మొత్తం 83,806 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,449 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.17 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.