స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి పింక్, కార్పొరేట్ అభ్యర్థికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్లు ఉంటాయని గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారులు సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ ఏర్పాట్లను ఆయన వివరించారు. 596 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు లో 2000 బ్యాలెట్ పేపర్లను ఒకే బ్యాలెట్ బాక్స్ లో వేయాలని చెప్పారు. నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు...
AP: 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీ/నగర పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలో నామినేషన్లకు SEC ఇచ్చిన 48 గంటల గడువు నిన్నటితో ముగిసింది. ఈ ఉదయం స్కూటినీ జరగనుంది. ఈ 4 మినహా మిగతాచోట్ల ఇప్పటికే నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా, అన్నీ కలిపి 3PM తర్వాత అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు. నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
TG: ఇంటర్ బోర్డు అధికారులు లంచాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రైవేటు జూ. కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు సతీశ్ ఆరోపించారు. ఫీజు చెల్లించి నెలలు గడుస్తున్నా 128 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదన్నారు. వారం రోజుల్లో అనుమతులు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీలను మూసివేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. నకిలీ NOCలు సమర్పిస్తే వాటిని తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నించారు.
కొత్తగూడెంలో మిషన్ బాల్ సురక్ష సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత బాలల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
బాలల హక్కుల పరిరక్షణ, వారికి సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. ప్రేమలత అన్నారు. జిల్లా న్యాయ...