Bharat Aawaz
మదనపల్లె: సీటీఎం-1 ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున 68 ఏళ్ల ఉత్తమ్మ నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను సహాయకులు పట్టుకుని నామినేషన్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళా రిజర్వేషన్ కారణంగా పోటీ చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపినట్లు సమాచారం. మరోవైపు, యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న జనసేన పార్టీ 68 ఏళ్ల వృద్ధురాలిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
21 Views