Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని కలిసిన 7వ బెటాలియన్ కమాండెంట్ బి. సీతారాం🚩
    ▫️నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వక భేటీ ▫️బెటాలియన్ అభివృద్ధి, పరిపాలన, వసతుల కల్పనపై చర్చ ▫️పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం 🔸నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్‌పల్లి కేంద్రంగా గల 7వ బెటాలియన్ కమాండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి. సీతారాం ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ...
    148 Views
  • విజయదశమి వేళ ఆయుధ పూజ...వాహన పూజ.|
      ● ప్రజా రక్షణే పోలీసుల ధ్యేయం.. ప్రజా సేవే సంకల్పం ● శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో విధులు నిర్వహించాలి అల్వాల్, అక్టోబర్ 19: చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించడం మన సంప్రదాయమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పేర్కొన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే పోలీసు శాఖలో ఆయుధాలు, వాహనాలు కేవలం...
    209 Views
  • *ప్రజా సేవే లక్ష్యంగా 5 ఏళ్లుగా ప్రయాణం - పామూరు మండల యువకుడి ఆదర్శం*
    ప్రకాశం జిల్లా, పామూరు మండలం, కంబాలదిన్నె గ్రామానికి చెందిన D. శ్రీనివాసులు గత 5 సంవత్సరాలుగా ట్రావెల్స్ రంగంలో సేవలందిస్తున్నారు. సొంత వాహనం (Ertiga Car) ద్వారా ప్రజలకు తక్కువ ధరలో ప్రయాణ సౌకర్యం కల్పించడం తన లక్ష్యమని ఆయన తెలిపారు. మార్కెట్లో ఇతరుల కంటే చాలా తక్కువ రేటుకే బుకింగ్ తీసుకుంటానని, ముఖ్యంగా ఉన్నవారు లేనివారు అని చూసి, పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఛార్జీలు తీసుకుంటానని తెలిపారు....
    247 Views
  • బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.,
    వరంగల్ జిల్లా  దుగ్గొండి  మండలం చాపలబండ గ్రామంలో ఆడపడుచుల ఆరాధ్య దైవమైన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తల్లి విగ్రహం మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయాల్సిన...
    154 Views
  • ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి – ఏవో బండి ప్రకాష్
    పెద్దపల్లి, అక్టోబర్ 19: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.  
    364 Views
  • ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి – ఏవో బండి ప్రకాష్
    పెద్దపల్లి, అక్టోబర్ 19: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.  
    203 Views
  • సూర్యాపేట న్యూస్ ✍️✍️✍️
    నిన్నా పెద్ద బతుకమ్మ పండుగ సందర్బంగా ఊరంతా వెళ్తూరు ఉండేటట్లు చేస్తున్నా సమయంలో.. ప్రశాంత్ అనే యువకుడికి కరెంట్ షాక్ తగిలి చాలా సీరియస్ గా ఉంది దయచేసి 7లక్షలు ఖర్చు అవుతాయి అని డాక్టర్స్ చెప్పారు దయచేసి దాతలు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది.. అతను నిరుపేద కుటుంబం కావున మీ వంతు సహాయం చేయండి.. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామం వేల్పుజెర్ల అనేగ్రామ్ లో...
    112 Views
  • జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ని అశ్వారావుపేట నూతన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా పోస్టింగ్ వచ్చినందుకుగాను ప్రోటోకాల్ ప్రకారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో...
    190 Views
  • టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి!
    ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై ముంబైలోని జుహూ ప్రాంతంలో ఆదివారం, అక్టోబర్ 18న కాల్పులు జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బాధ్యత స్వీకరణ ఈ కాల్పుల ఘటనకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం...
    140 Views
  • పాత పాల్వంచలో భక్తిభావంతో అన్నదాన కార్యక్రమం
    పాత పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ రజక బజార్‌లో అమ్మవారి మండపం వద్ద భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ...
    Like
    1
    208 Views