సాలూరు వెలమపేట కల్యాణ మండపంలో సుఖీభవ హాస్పిటల్స్, వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. డాక్టర్ రామారావు, డాక్టర్ శరత్ కుమార్ పాత్రో ఆధ్వర్యంలో గుండె సమస్యలు, మధుమేహం, రక్తపోటు గుర్తింపునకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. 30 ఏళ్ల వయస్సు నుంచే ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.
#RAJESH
Madanapalle: రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మదనపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, రాజోలు ఎమ్మెల్యే, రాజంపేట పార్లమెంట్ కో-ఆర్డినేటర్ దేవ వరప్రసాద్ సమావేశానికి హాజరుకానున్నారు. రాజంపేట పార్లమెంట్ కమిటీ సభ్యులు అతికారి కృష్ణ, తాతంశెట్టి నాగేంద్రతో పాటు మదనపల్లెకు చెందిన దారం అనిత కూడా సమావేశంలో పాల్గొననున్నారు. మున్సిపల్...
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిగింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వనపర్తి కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.
Madanapalle: ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన ప్రచార సామాగ్రిని సోమవారం పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తో పాటు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ వై. శ్రీనివాసులు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్లై, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ...
Madanapalle: అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో స్కూటీ పెప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్కూటీలో గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు సమాచారం. అయితే మంటలు వెంటనే అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
దేశంలోని 11 విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయాన్ని తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంతో కలిపి (బండ్లింగ్) ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) జారీ చేసింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సైతం భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో, క్యూలైన్లు వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి.
టీటీడీ వెల్లడించిన వివరాల మేరకు, సోమవారం (సెప్టెంబర్ 28) ఒక్కరోజే 84,171 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు రోజు కూడా దాదాపు...
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. ప్రధానంగా ఆరు జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండనుంది....
భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు మండలం ఓ ప్రధాన రహదారి పక్కన చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. చెట్ల మధ్య ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు, ఇతర చెత్తాచెదారం పేరుకుపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు రహదారి పక్కన శుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా...