Bharat Aawaz
Arkapally18 Chaitu1814

Arkapally18 Chaitu1814
Verified User
BMA | BHARAT AAWAZ Member

@arkapallychaitanyajyothi REPORTER - Bharat Aawaz
Recent Updates
  • కల్వకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ సహకారం
    కల్వకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందించింది. ఇటీవల కల్వకుర్తిలో వార్డు కార్యాలయాల ప్రారంభంతో పాటు మహిళా సంఘాలకు ₹7.25 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులు, రైతులకు సబ్సిడీ స్ప్రింక్లర్లు అందించారు.
    166 Views
  • గాంధీ జయంతి కార్యక్రమం
    గాంధీ  జయంతి సందర్బంగా ఈరోజు కల్వకుర్తి మున్సిపల్‌ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి ఆవిష్కరించారు.
    212 Views
  • కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష
    కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిగింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వనపర్తి కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.
    240 Views
  • కోర్టు నూతన భవనానికి నిధుల కోసం ఎమ్మెల్యే హామీ
    కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని న్యాయవాదులు కలిసి కోర్టు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అవసరమైన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
    278 Views
  • కల్వకుర్తి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రకటన
     కల్వకుర్తి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల ప్రకటన చేశారు. పట్టణంలో సుమారు రూ.120 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 22 వార్డులకు వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
    275 Views
  • మా గల్లీ గణపతి
    వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కల్వకుర్తిలో వినాయక నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, భక్తుల ఆధ్వర్యంలో శోభాయాత్రగా తరలించారు. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
    320 Views
  • “గణపతి బప్పా మోరియా… వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా!”
    కల్వకుర్తి: పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను శోభాయాత్రగా నిమజ్జన స్థలాలకు తరలించారు.   భక్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. భక్తి గీతాలు, మంగళవాయిద్యాల మధ్య నిమజ్జన కార్యక్రమం కొనసాగింది.   నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కల్వకుర్తి...
    449 Views
  • కల్వకుర్తి మున్సిపాలిటీకి కొత్త నాయకత్వం
    కల్వకుర్తి, సెప్టెంబర్ 24, 2026: కల్వకుర్తి మున్సిపాలిటీ కొత్తగా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, ఎండి షా నవాస్ ఖాన్, వైస్ చైర్మన్ గా భాద్యతలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. కల్వకుర్తి అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం కొత్త పాలక వర్గానికి ప్రధాన బాధ్యతగా...
    379 Views
  • కల్వకుర్తి లో వర్ష సూచన
    కల్వకుర్తి పట్టణం తో పాటు పరిసర గ్రామాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆకాశం మబ్బులతో కమ్ముకుని వర్షం పడింది. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
    392 Views
  • ఇందిరమ్మ ఇళ్ళు
    కల్వకుర్తి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
    414 Views
  • కల్వకుర్తి లో వరుణుడి పలుకరింపు
    గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న కల్వకుర్తి నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. మంగళవారం మధ్యాహ్నం కల్వకుర్తి లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది, దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
    633 Views
More Stories