📍 అనంతపురం జిల్లా :
🔥🚌 ప్రైవేట్ బస్సు దగ్ధం ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు 👮♂️
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జిల్లాలోని పెద్దవడగూరు మండలం మిడతూరు సమీపంలోని జాతీయ రహదారిపై అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. 🔥🚌
ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు ఘటనా స్థలానికి...
భారత్ అవాజ్ న్యూస్:- సెప్టెంబర్ 5 తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ కూతురు పిట్టల సిరివెన్నెల (14) కృష్ణాష్టమి నేపథ్యంలో ఉదయాన్నే స్నానం చేయడానికి వెళ్ళింది. మోటార్ ఆన్ చేయడానికి స్విచ్ వేయడంతో కరెంట్ షాక్ కి గురైంది. అప్పటికే ఎలుకలు వైర్లను...
గోవు బొమ్మను చూసిన ఓ లేగదూడ, అది తన తల్లేనని భావించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లి చనుబాలు వెతికిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకలితో తల్లి కోసం వెతుకుతున్న పసి ప్రాణి బొమ్మను సైతం అమ్మగా భావించడం చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. అమ్మ ప్రేమకు రూపం కాదు.. బంధమే ముఖ్యమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
చీరాల:
భారతరత్న, తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి మరియు రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
స్థానిక గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 12...
ఈపూరుపలెం
చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన గుద్దంటి గోపీచంద్‌కు సంబంధించిన 274-3B సర్వే నంబర్ స్థల డాక్యుమెంట్లు గల్లంతయ్యాయి. డాక్యుమెంట్ నంబర్లు *3163/91, 3035/95* కాగా, ఇటీవల అవి కనిపించకుండా పోయినట్లు తెలిపారు.
ఈ డాక్యుమెంట్లు ఎవరికైనా దొరికినట్లయితే, దయచేసి క్రింద పేర్కొన్న ఫోన్ నంబర్‌కు సమాచారం అందించవలసిందిగా గుద్దంటి గోపీచంద్ కోరుతున్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్:...
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లోకల్ పోలీస్, ఈగల్, జీఆర్పీ సిబ్బంది గజపతినగరం నుంచి విజయనగరం వరకు అన్ని బోగీల్లో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు. ఎలాంటి నిషేధిత పదార్థాలు లభించలేదని ఎస్పీ దామోదర్ తెలిపారు. గంజాయి సమాచారం ఉంటే 1972 లేదా 100/112కు తెలియజేయాలన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు చంద్రబాబు శుభాకాంక్షలు
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
సర్వేపల్లి రాధాకృష్ణన్ విలువలను భావితరాలు పాటించాలని పిలుపునిచ్చిన సీఎం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, మహోన్నత విద్యావేత్త డాక్టర్...
వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తిన భక్తులు
నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు
శుక్రవారం రోజు హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
క్యూలైన్లలో భక్తులకు ఆహారం, తాగునీరు అందిస్తున్న టీటీడీ
వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిశాయి. దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై తీవ్ర రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ...
స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా 13 జెడ్పీలను 28కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా జెడ్పీలను మంజూరు చేసింది. వీటితో పాటు అదనంగా 15 జెడ్పీ సీఈవో, 15 Dy. సీఈవో పోస్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన అనంతరం 28 జెడ్పీల వ్యవస్థ అమల్లోకి రానుంది.