🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉందని వాంకిడి మండలం బెండర ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కనకయ్య తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ, టెన్ ప్లస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ...
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న 1వ వార్డు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు మరోసారి తన చొరవను చాటుకున్నారు. 1వ వార్డు పరిధిలోని డ్రైనేజీలో గత కొంతకాలంగా చెత్త, మట్టి భారీగా పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తి, స్థానిక...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)కు నిరసనగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ గాంధీపై అక్రమంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీ (DCC) అధ్యక్షురాలు ఆత్రం...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణ లో నూతనంగా ఏర్పాటు REYVION GEMS & JEWELS ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, సినీనటి రితికా నాయక్ పాల్గొన్నారు ఈ సందర్బంగా యాజమాన్యానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు,...
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు 2026–27 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యతో...
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు,గూడెం గోదావరి పుష్కరఘాట్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను...
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉయిక శిరీష మృతికి కారణమైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని చింతూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. హైదరాబాదులోని తుక్కుగూడ కార్పొరేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎం గా విధులు నిర్వహించి రెస్ట్ తీసుకుంటున్న ఆదివాసి మహిళ శిరీష హత్య అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదివాసి జేఏసీ ఆదివాసీ గిరిజన...
అమరావతి ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు కురుపాం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ కె.జయతో పాటు రెవెన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసనను తెలియజేశారు.
వీరఘట్టం మండలం కంబరలో మన బాట మన మాట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా స్వశక్తి సాధించి తాము ఉత్పత్తి చేసే పంటలు, వస్తువులను నేరుగా కార్పొరేట్ సంస్థలకు విక్రయించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ నైపుణ్యాల పెంపునకు శిక్షణ, ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు.గ్రామాల్లో డ్రైనేజీ కాలువల ఆక్రమణలను తొలగించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు, ఒడిశా పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు.20 దాడుల్లో 17000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 5750 లీటర్ల నాటుసారా, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. 72 కేసుల్లో 147 మందిని అరెస్టు చేసి, 17 వాహనాలను సీజ్ చేశారు.