Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వెయిట్ లిఫ్టర్ గురునాయుడుకు ఎస్పీ అభినందన
    నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన వెయిట్ లిఫ్టర్ శనపతి గురునాయుడును ఎస్పీ దామోదర్ అభినందించారు. తాష్కెంట్లో జరిగిన జూనియర్ ఆసియన్ ఛాంపియన్షిప్లో 60 కిలోల విభాగంలో పతకాలు సాధించడంతో పోలీస్ కార్యాలయంలో ఎస్పీను శనివారం కలిశారు. భవిష్యత్తులో కామన్వెల్త్, ఒలింపిక్స్లోనూ రాణించి బంగారు పతకాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
    243 Views
  • ఏ ఒక్క ఓటు తొలగించకుండా చర్యలు
    అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా, అనర్హుల పేర్లు లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం విజయనగరం కలెక్టరేట్లో ఎస్ఐఆర్పై ఈఆర్డీఓలు, ఏఈఆర్డీలు, రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 82 వేల మంది యువ ఓటర్లను జాబితాలో చేర్చాల్సి ఉందని, వారిపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కల్పించాలన్నారు.
    226 Views
  • ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం..
    మంచిర్యాల నియోజకవర్గం :లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే...
    215 Views
  • కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల నియోజకవర్గం :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ (గుడిపేట) లోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్  కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు,ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి బాధ్యతలను అప్పగించారు....
    236 Views
  • చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!
    చింతూరు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.మణిమాల గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు భాషకు,సరళత,సమానత్వం, ప్రజల నాఢీకి దగ్గరగా ఉండేలా చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు అని,...
    297 Views
  • డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కి మంచి సువర్ణావకాశం
    డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉచిత సీఆర్‌టీ శిక్షణ:    అప్‌టెక్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఈడే లక్ష్మీపతి     విజయవాడ   (గవర్నర్‌పేట)      డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు ఉచితంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (సీఆర్‌టీ) తరగతులను నిర్వహిస్తున్నట్లు...
    410 Views
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.....
     భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో లోనే లక్ష్మి రమేష్ ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ మాటేటి రవి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గుజిలే రమ శ్రీను  ఇటుకల మౌతిక్  మంద అనిల్  ప్రమిల మరియు మార్కెట్ డైరెక్టర్ హింగే రామారావు మరియు గ్రామ కార్యదర్శి వై నాలా యాదగిరి ఈ...
    358 Views
  • ఉత్తరాంధ్ర నేతపై జోరుగా చర్చ!
    ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.విజయసాయిరెడ్డి లేఖలో ప్రస్తావించిన పేరు ఓ సీనియర్ నేతని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఈయన జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తుండగా, విజయసాయి లేఖతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
    300 Views
  • పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ
    జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. పొలంలో మేకలు మేపేందుకు వెళ్లిన అప్పలనరసమ్మను శనివారం సాయింత్రం పాము కాటు వేసింది. పొలంలో ఉన్న వారు గమనించి హుటాహుటిన సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
    193 Views
  • పవర్ కట్.. తాగునీటి సరఫరాకు అంతరాయం
    వంగరలో తాగునీటి సరఫరా ఆదివారం నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు బోరు మోటర్లు వద్ద నీటిని పట్టుకుంటున్నారు. శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో తాగునీటి ట్యాంకులో నీరు నింపేందుకు అవ్వలేదని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం నీటిని ట్యాంకులకు ఎక్కిస్తున్నామని ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు తాగునీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
    233 Views