Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం
    కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం తెలిపారు. సమీప జలప్రాంతాల్లో తిరుగుతున్నాయని, ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల గుంపుతో తీవ్రంగా పంట నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
    242 Views
  • ఆ ఆరోపణలను నమ్మవద్దు: బొబ్బిలి MLA
    మెగా డీఎస్పీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. డీఎస్సీలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వలేదని అభ్యర్థులు చెప్పారు.
    404 Views
  • ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి: ఏబీఎన్ రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి!
    ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.! ‎కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.. ‎ABN లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకు ఉంది. ‎ABN రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బాగుండదు హెచ్చరిస్తున్నా.. ‎మీడియా ముసుగులో అస‌లైన తెలంగాణ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా. ‎ఇప్పుడు...
    416 Views
  • వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు
    వంగర మండలం మగ్గూరులో గురువారం వీధి కుక్క దాడిలో బోనెల హర్షవర్ధన్ (4) అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల వద్ద నడుస్తుండగా కుక్క తల, చేయిపై దాడి చేసింది. వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం 108 వాహనంలో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    246 Views
  • డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.85.20 లక్షల మోసం.|
    ● నకిలీ NIA అధికారి బెదిరింపులకు భయపడ్డ 85 ఏళ్ల వృద్ధుడు ● సకాలంలో స్పందించిన TGCSB.. మొత్తం నగదు ఫ్రీజ్ ● సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శిఖా గోయల్ సూచన ఆల్వాల్, ఆగస్టు 27: డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరేడ్‌మెట్‌కు చెందిన 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసగించిన ఘటనలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సకాలంలో స్పందించి రూ.85.20 లక్షలను కాపాడింది. ఈ...
    248 Views
  • పూర్ణపాడులో ఏనుగులు
    పూర్ణపాడు గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారం ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఏనుగులు కనిపిస్తే వాటిని తరిమే ప్రయత్నం చేయకుండా సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
    206 Views
  • విజయనగరంలో వృద్ధురాలిపై అత్యాచారం
    విజయనగరంలో బుధవారం జరిగిన దారుణ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న 82 ఏళ్ల వృద్ధురాలిని ఓ వ్యక్తి అడ్డుకుని, అత్యాచారానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
    202 Views
  • చంద్రకు రూ. 22,000 కోట్ల నజరానా?




    బహుశా భారత దేశ కార్పొరేట్‌ చరిత్రలో ఈ స్థాయి రుణమాఫీ జరగడం ఇదే మొదటిసారి ఏమో? పైగా ఓ వ్యక్తికి… కంపెనీకి కాదు. జీ గ్రూప్‌ అధినేత, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న సుభాష్‌ చంద్రకు సంబంధిచిన రూ. 22000 కోట్ల రుణాన్ని ఎన్‌సీఎల్‌టీ దాదాపు కొట్టేసింది. ఆయన ఇవ్వాల్సిన మొత్తం రూ. 22,006 కోట్లు కాగా, ఇందులో రూ. 6.5 కోట్లు చెల్లించాల్సిందిగా తాజాగా NCLT ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన NCLT జ్యుడిషియల్ మెంబర్‌ జడ్జి నిలేష్‌ శర్మ 144 పేజీల ఉత్తర్వులు జారీ చేశారు. రుణదాతులు అడిగినంత సొమ్ము సుభాష్‌ చంద్ర వద్ద లేదని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం విశేషం. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు జడ్జీల బెంచ్‌ భిన్న తీర్పు ఇచ్చింది. దీంతో శర్మను ఈ ధర్మాసనంలో మూడో సభ్యునిగా చేర్చారు. ఆయన చంద్రకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దాదాపు 99.97 శాతం హెయిర్‌ కట్‌ (రుణ మాఫీ)తో ఇచ్చిన ఈ తీర్పు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాపం ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇచ్చిన రుణం ఏకంగా రూ. 1322 కోట్లు కాగా, కేవలం రూ. 38 లక్షలతో సరిపెట్టుకొమ్మని NCLT ఆదేశించడం కార్పొరేట్‌ రంగం ఆశ్చర్య పోయేలా చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ము ఇలా వేల కోట్లను ఎలా మాఫీ చేస్తారని సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీనిపై యూనైటెడ్‌ బ్యూవరీస్‌ మాజీ ఛైర్మన్‌, ప్రముఖ పారశ్రామిక వేత్త విజయ్‌ మాల్యా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. తాను రూ. 6203 కోట్లు బాకీ ఉంటే… ఏకంగా రూ. 14,100 కోట్లను తన నుంచి వసూలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్‌ మాల్యా విదేశాల్లో ఉంటే ఆయన కంపెనీ షేర్లను ఈడీ జప్తు చేసింది. ఆ తరవాత వీటిని డచ్‌ కంపెనీ హెంకిన్‌ ఎన్‌వీకి అమ్మేశారు. మాల్యాకు కంపెనీలో ఉన్న 15 శాతం వాటాను రూ. 5824 కోట్లకు అమ్మేశారు. ఇంకా ఇతర ఆస్తులను కూడా జప్తు చేసి అమ్మేశారు. తన ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 14,100 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వం అంగీకరించిందని విజయ్‌ మాల్యా ఇవాళ తన పోస్ట్‌ పెట్టారు. కాని ఏ మీడియా సంస్థ కూడా దీన్ని ప్రశ్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    331 Views
  • సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్, IPS
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులు జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.సిబ్బంది సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత, పోలీస్ అసోసియేషన్...
    464 Views