Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మిలాదున్నబీ వేడుకలు
    నిర్వహణ నిజామాబాద్: పవిత్ర మిలాదున్నబీ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు జష్నే మిలాదున్నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రవక్త మహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి బోధనలు, సందేశాలను స్మరించుకున్నారు. వక్తలు మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవాళికి ప్రేమ, శాంతి, కరుణ, సోదరభావం, సమానత్వం, న్యాయం వంటి...
    289 Views
  • నిజామాబాద్
    నిజామాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. 400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేయడం, హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించడం సంతోషకరం.  డాక్టర్ కవిత రెడ్డి  IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్    
    222 Views
  • రోడ్డు భద్రతపై కురుపాం పోలీసుల అవగాహన
    కురుపాం పోలీసుల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని ఎస్ఐ పి.నారాయణరావు సూచించారు.
    251 Views
  • ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన ఎంపీడీవో
    కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామ సచివాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను బుధవారం ఎంపీడీవో ఉమామహేశ్వరి తనిఖీ చేశారు. ఓటరు నమోదు కచ్చితత్వంతో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.రిజెక్ట్ అయిన ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తుల సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పునఃపరిశీలించి నిర్ణీత గడువులోగా సబ్మిట్ చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
    222 Views
  • ఏగోటివలస,అనంతరాయుడుపేట గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటన
    సీతానగరం మండలం ఏగోటివలస, అనంతరాయుడుపేట గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటించారు. రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం కార్య క్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం-2, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు తదితర పథకాల ప్రయోజనాలను వివరించారు.
    184 Views
  • మచ్చబొల్లారంలో మిలాద్ వేడుకలు.|
    ● ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● మహమ్మద్ ప్రవక్త సందేశాలను గుర్తుచేసిన ఎమ్మెల్యే ● సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని పిలుపు అల్వాల్, ఆగస్టు 26: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్‌లో జష్న్-ఎ-మిలాద్-ఉన్-నబీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక  బిఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ జావిద్...
    213 Views
  • పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గమనిక!
    పోలవరం ప్రాజెక్టు పునరావాసం మరియు పునర్నిర్మాణం (R&R) అర్హుల జాబితాలో ఉండి, ఇప్పటివరకు నష్టపరిహారం అందని నిర్వాసితులకు తమ బ్యాంకులో ఖాతాలు తెరిచే అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్‌బిఐ (SBI) మేనేజర్ సాయి చందర్ తెలిపారు. మల్లెతోట, ఏజీ కోడేరు, చింతూరు ప్రాంతాల నిర్వాసితులు. చింతూరు MPDO కార్యాలయంతో పాటు స్థానిక CSP (కస్టమర్ సర్వీస్ పాయింట్) కేంద్రాలు. R&R అధికారి శుభం నోక్వాల్ ఆదేశాల మేరకు...
    278 Views
  • అమెరికా ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన యువకుడు పుట్టా రాహుల్ మరణించారని తెలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    ప్రాథమిక సమాచారం మేరకు రాహుల్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు యువకుల్లో ఒకరు మరణించగా, మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోందని, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించడమే కాకుండా తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

    విదేశీ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    452 Views
  • సెల్ఫోన్ లైట్లలో వైద్యం దౌర్భాగ్యం
    కురుపాం నియోజకవర్గంలోని భద్రగిరి సీహెచ్సీలో విద్యుత్ సౌకర్యాలు సరిగా లేక రోగులకు సెల్ఫోన్ లైట్లలో వైద్యం అందిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. బాగా మరిగిన నీరు ఒంటిపై పడి గాయాలైన ఐదేళ్ల బాలుడికి చీకటిలో సెల్ఫోన్ లైట్లతో వైద్యం అందిస్తున్న దృశ్యం గిరిజన ప్రాంతాల్లో వైద్య పరిస్థితులకు నిదర్శనమన్నారు.
    197 Views