Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తర్లుపాడు మండలం,పోతలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన
    తర్లుపాడు మండలం,పోతలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లాకలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఐసీడీఎస్ ఇంచార్జి పీడీ పద్మావతి గారు,ఇతర సిబ్బంది. ఈ సందర్భంగా చిన్నారులు,బాలింతలు,గర్భిణీలకు అందుతున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతున్నాయా లేదా వంటి విషయాల పై కలెక్టర్ ఆరా తీశారు.అదే విధంగా వారి ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
    231 Views
  • వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై మహేష్ హెచ్చరిక
    రెచ్చగొట్టే పోస్టులకు చెక్. సుండుపల్లి పోలీసులు హెచ్చరిక. సుండుపల్లి మండలంలోని వాట్సాప్ గ్రూపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసభ్యకర పోస్టులు వివాహస్పద సందేశాలు ప్రచారం చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్ లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సొండుపల్లి ఎస్సై మహేష్ హెచ్చరించారు. కొందరు గ్రూపులుగా విడిపోయి ఇతరులను రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తున్నట్లు పోలీసులు దృష్టికి వచ్చిందన్నారు ఇలాంటి వాట్సప్ గ్రూపులపై...
    338 Views
  • రేపటి వరకే ఛాన్స్. SIR
    ఏపీ ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు తమ ఇనుమరేషన్ పూర్తి చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది రేపటి లోగా ఫామ్ లోని ఫీల్ చేసి బిఎల్వోలకు సబ్మిట్ చేయాలి లేదా ఓటర్స్ ఈసిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లోనే ఎన్ని పూర్తి చేయవచ్చు. ఈపీఐసీ నంబరు ఓటిపి ద్వారా లాగిన్ అయిన తర్వాత పాత రికార్డులతో మీ వివరాలను లింకు చేయాలి. ఆధార్ ఈ ఈ సైట్ ద్వారా ఫామ్ను సబ్మిట్ చేయాలి.
    338 Views
  • సీఎంసీ భవనానికి హైకోర్టు బ్రేక్.|
    "భూ యాజమాన్య వివాదంతో స్టేటస్ కో.. తాత్కాలికంగా నిలిచిన నిర్మాణ పనులు" హైదరాబాద్ జులై 13: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది.  మియాపూర్ సమీపంలోని ఖానామెట్‌లో ఈ భవన నిర్మాణానికి కేటాయించిన భూమిపై యాజమాన్య హక్కుల వివాదం నెలకొనడంతో, ఆ స్థలంలో...
    420 Views
  • రామాపురం: అనుమానాస్పత స్థితిలో వృద్ధుడి మృతి
    రాయచోటి కడప ప్రధాన రహదారిపై బండపల్లి పంచాయతీ హెచ్పీ పెట్రోల్ బంకు ఎదురుగా ఓ వ్యక్తి చనిపోయాడు. మృతుడు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి డైట్ సప్లై కాంట్రాక్టర్ వెంకటరమణగా గుర్తించామని ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈనెల 10న ఇంటి నుంచి వెళ్ళినా ఆయన తిరిగి రాలేదు మద్యం అలవాటు వడదబ్బా లేదా ఇతర కారణాలతో మృతి చెందార. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    407 Views
  • అన్నమయ్య: వాట్సప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై వార్నింగ్
    వాట్సప్ గ్రూపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసభ్యకర పోస్టులు తప్పుడు ప్రచారం చేస్తే అడ్మిన్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుండుపల్లి ఎస్సై మహేష్ హెచ్చరించారు. ఇలాంటి పోస్టులపై పోలీసులు నిగా ఉంటుందన్నారు శాంతిభద్రతలకు భంగం కలిగించే మెసేజ్లకు దూరంగా ఉండాలని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
    330 Views
  • మంచిర్యాల్: ప్రేమ వేధింపు లు.. యువతి ఆత్మహత్య..
    జైపూర్ మండల లోని టేకుమట్ల గ్రామానికి చెందిన మాధవి సోమవారం ఆత్మహత్య చేసుకుంది.. అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ అన్న యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురుచడం వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.. ఘటనపై జైపూర్ ఎస్సై భూమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. కాగా , నిందుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మంచిర్యాల్ లో ఆందోళన చేపట్టారు..
    480 Views
  • శ్రీ లక్ష్మీనగర్‌లో సీసీ రోడ్ల పనుల పరిశీలన.|
    "కాలనీ అధ్యక్షుడి వినతితో రూ.51 లక్షల నిధులు.. ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం" మేడ్చల్ మల్కాజ్గిరి జులై 13: ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో రూ.51 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు.  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి...
    248 Views
  • కనాజిగూడలో కొత్త విద్యుత్ పోల్స్.|
    "రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు.. స్థానికుల్లో హర్షం" మేడ్చల్ మల్కాజ్గిరి జులై 13: ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని కనాజిగూడ బస్తీలో రహదారి మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పనులు పూర్తికావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. స్థానికుల సమస్యను గుర్తించిన మల్కాజిగిరి...
    246 Views