అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు
నిన్న అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా నియమితులైన శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఐపీఎస్ గారు, ఈ రోజు గుంటూరు జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
2022...
లోపట్నూతల గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి గారు
లింగాల మండలం లోపట్నూతల గ్రామానికి చెందిన రామాచారి, శ్రీమతి సృజన దంపతుల నాలుగేళ్ల కుమార్తె నిత్విక గత నెల జూన్‌లో నీటి డ్రమ్‌లో పడి విషాదకరంగా మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ రోజు బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి మాజీ ఎమ్మెల్సీ,పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి గారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిన్నారి మృతి...
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాంలో జరుగుతున్న ఎన్యుమరేషన్,డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లాకలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు,తదితరులు.ఈ సందర్భంగా డిజిటలైజేషన్లో వెనుకబడి ఉండటంను గమనించి గడువుతేది ఇంకా రెండురోజులే ఉన్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ముగించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక గొప్ప అండగా నిలుస్తోందని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
దర్శి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి నియోజకవర్గానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు, 3 మందికి LOC (Letter of Credit)...
యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఒంగోలు రీజినల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో మార్కాపురం నూతన కలెక్టరేట్ కు 7 కంప్యూటర్లను అందజేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు గారు,ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి గారు,ఒంగోలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రవికుమార్,LDM షాహీర్, మార్కాపురం మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి,తదితరులు..
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు.
ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ టిడిపి జోనల్ కో-ఆర్డినేటర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గారు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి జిల్లా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే...
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మరియు చెడు నడత కలిగిన వారికి పోలీసు అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో జీవించాలని,...
త్రిపురాంతకం మండల కేంద్రం,
అదేవిధంగా రాజుపాలెం స్వర్ణ గ్రామకార్యాలయాల్లో సర్ ప్రోగ్రాం ఎన్యూమ్యారేషన్,డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు.డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇంకా వెనుకబడి ఉండటాన్ని గమనించి త్వరితగతిన పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.గడువుతేది సమీపిస్తున్నవేళ ఇంకా నిర్లక్ష్యం మంచిదికాదని వారిని కలెక్టర్ హెచ్చరించారు...
సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ( MPC, BIPC ) మిగులు సీట్లకు, ఈనెల 14 నా స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించునున్నారు. ఆసక్తి గల SC, ST, BC విద్యార్థులు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం 7995010587 నెంబర్ ను సంప్రదించవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కుని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటును కాపాడుకోవాలని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. 'SIR' ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు వివరాలు ధ్రువీకరణ సరిగా జరిగేలా చూడాలని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.