శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో 16 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపింది. వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వారు ఎక్కడికి వెళ్లారు, ఏ పరిస్థితుల్లో అదృశ్యమయ్యారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సమాచారం.
అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27) అనే యువతిని శుక్రవారం అరెస్ట్ చేశారు. తూ.గో జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన ఈమె, విజయవాడకు చెందిన మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది. 2025లో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డిని వివాహం...
మదనపల్లెలో జరిగిన ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలో, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు, మిర్చి, పత్తి, వరి, టమోటా వంటి పంటలకు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన కోరారు. రైతు ఆధారిత పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలని, హంద్రీ-నీవా కాలువలు పూర్తి చేయడం, పంటల బీమా, పాడి రైతులకు మద్దతు, టమోటా...
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. కాలువపై నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని, అలాంటప్పుడు విగ్రహ ఏర్పాటుకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. శివాజీపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే విగ్రహాన్ని అనువైన మరో ప్రాంతానికి తరలించాలని కోరారు. ఈ మేరకు మంత్రులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు...
మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్ (35) కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో శివకుమార్‌ను కాపాడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం...
శుక్రవారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో రెడ్డెంవారిపల్లికి చెందిన రైతు చిన్నరమణా రెడ్డి(55) తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనుల నిమిత్తం ములకలచెరువుకు వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రైల్వే రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో రైతు పరిస్థితి విషమంగా మారింది.
"హస్మత్‌పేట్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. "
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: హైడ్రా మరోసారి కూల్చివేతల చర్యలను వేగవంతం చేసింది. ఆల్వాల్ మండల పరిధిలోని హస్మత్‌పేట్ చత్రిగడ్డ సర్వే నెం.1లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగిస్తోంది.
స్థానిక పోలీసులతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది మోహరించగా,...
🎤భారత్ ఆవాజ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ న్యాయ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం TG LAWCET మరియు PGLCET అడ్మిషన్ల సమగ్ర కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ కోర్సుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జూలై 5 నుండి జూలై 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 10 లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 24న...
ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతి ఒక ఆటోకు ఒక సీరియల్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ధైర్యం కలిగేలా పోలీస్ సిబ్బంది వ్యవహరించారు.ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు వాహనంలో అందుబాటులో ఉంచాలని వేదులపల్లి ఎస్సై ఎం. వెంకటేశ్వర్లు సూచించారు.
వేదులపల్లి ప్రాంతంలో ఆటో డ్రైవర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు దూర...
'ప్రతి అర్హుల ఓటే ప్రజాస్వామ్యానికి బలం: శాంతి శ్రీనివాస్ రెడ్డి"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా జేజే నగర్, రామ్‌నగర్, జానకీనగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
బూత్ లెవల్ అధికారులతో కలిసి పంపిణీ తీరును సమీక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫారాలు అందేలా...