Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పలాస–కాశీబుగ్గ అభివృద్ధికి ఐదేళ్లుగా విశేష కృషి
    వంశధార నీటి ప్రాజెక్టుతో తాగునీటి సమస్యకు పరిష్కారం అన్ని వార్డులకూ సమాన ప్రాధాన్యమిచ్చాం: మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బల్లా గిరిబాబు   పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ పాలకమండలి హయాంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులు, విద్య, వైద్య రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బల్లా గిరిబాబు...
    150 Views
  • సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి పోటీల్లో నాలుగు ఈవెంట్లకు ఎంపికైన నాగజ్యోతి

    అనకాపల్లి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు సంబంధించి అనకాపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పీవీఎం నాగజ్యోతి సత్తా చాటారు.

    జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నాగజ్యోతి ఏకంగా నాలుగు ఈవెంట్లలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

    ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీల్లో ఆమె నాలుగు విభాగాల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించి జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
    69 Views
  • దేవినూతల ఎంపీటీసీ అభ్యర్థిగా మల్లవరపు పద్మ నామినేషన్ దాఖలు
    చీరాల: దేవినూతల కూటమి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా మల్లవరపు పద్మ గురువారం చీరాల మండల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వన్ ప్లస్ టు సభ్యులుగా దేవినూతల గ్రామ పార్టీ అధ్యక్షుడు గోనబోయిన ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ గవిని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా తనకు ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య (కొండయ్య)కు మల్లవరపు పద్మ కృతజ్ఞతలు...
    23 Views
  • నందిపేట్‌లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం

    40 ఏళ్ల నిరీక్షణకు తెర.. నందిపేట్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం

    నందిపేట్ గ్రామంలో గత నాలుగు దశాబ్దాలుగా అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయానికి ఎట్టకేలకు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1986 ఆగస్టు 27 నుంచి 40 సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయానికి సొంత భవనం నిర్మాణం చేపట్టడంతో గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి.

    ఇన్నాళ్లుగా చిన్న అద్దె భవనంలో గ్రంథాలయం కొనసాగుతుండటంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుగైన వసతులతో కూడిన నూతన గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ, వారి నిరీక్షణకు ఇప్పటివరకు ముగింపు లభించలేదు.

    తాజాగా నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో విద్యార్థులు, యువత, గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. నూతన భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలగడంతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
    15 Views
  • కోదాడ మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ నీ బలోపితం చెయ్యాలి: ఓరుగంటి ప్రభాకర్ రావు గారు
    కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 12వ వార్డు నందు ఉదయం 10 గంటలకు పట్టణ సమన్వయ కమిటీ అధ్యక్షుడు కట్టా సతీష్ మరియు ప్రధాన కార్యదర్శ సంపేట బాలకృష్ణ , ముఖ్య అతిథులుగా నియోజకవర్గం మాజీ ఇంచార్జి ఓరుగంటి ప్రభాకర్ చిలుకూరు మండల మాజీ అధ్యక్షులు సాతులూరు గురవయ్య సీనియర్ నాయకులు కోదాటి గురవయ్య సమక్షంలో, కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీను కార్యకర్తల సమక్షంలో నియమించడం...
    132 Views

    18 Views

  • బహుజన వీరుడు, పేదల పక్షపాతి, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి సందర్భంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డగా గుర్తింపు పొందిన సాయన్న పోరాట స్ఫూర్తిని, పేదల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు తెలియజేయాలని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.
    9 Views
  • ఏపీ మునిసిపల్ ఎన్నికల తేదీ మార్పు
    ఏపీలోని అన్ని మున్సిపల్ స్థానాలకు పోలింగ్ రీ షెడ్యూల్ అయింది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 28న పోలింగ్ జరగాల్సి ఉంది.దాన్ని నవంబర్ 1కి మారుస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుoదీ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఇక్కడ ఈ నెల 23,24 తేదీలలో కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. 25న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.
    15 Views