Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కల్లూరు ఘాట్ రోడ్డులో బోల్తాపడ్డ ట్రాక్టర్
    గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ఘాట్ రోడ్డులో మామిడికాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. సదుం మండలం భూరగమంధ నుంచి దామలచెరువు వైపు వెళ్తున్న ఈ ట్రాక్టర్ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా బయటపడటంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది# కొత్తూరు మురళి .
    243 Views
  • నందిగామలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండగ వేడుకలు
    మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అన్నదాన కార్యక్రమంనందిగామ పట్టణంలో పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పీర్లను తీసుకుని భక్తులు పట్టణ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలు వెల్లివిరిశాయి.భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాజంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొనాలని ప్రార్థించారు. పండుగ సందర్భంగా...
    444 Views
  • హీరో బాలకృష్ణకు 111 ప్రత్యేక చిత్రాల మాలికను అందజేసిన ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకులు వడ్డెల్లి
    బాలయ్యకు 111 చిత్రాల ప్రత్యేక చిత్రమాలిక బహుకరణ   కోట్లాదిమంది అభిమాన హీరో బాలయ్య   ఆంధ్రప్రదేశ్ అభిమాన సంఘ నాయకుడు వడ్డెల్లి    నందిగామ జూన్ 25 మెట్రో ఉదయం : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్ర ముహూర్త కార్యక్రమం సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక చిత్రమాలికను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు బాలకృష్ణకు...
    466 Views
  • నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల కార్యాలయంలో MSME ఆధ్వర్యంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలకు సబ్సిడీతో కూడిన రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో లబ్ధిదారులకు వివిధ రకాల MSME రుణ పథకాల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం అర్హులైన సభ్యుల నుంచి రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించి పూర్తి...
    438 Views
  • గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన  నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన గృహప్రవేశం సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులైన స్వరూపక్రాంతులకు నూతన వస్త్రాలను కానుకగా ఇచ్చిన ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు మహేందర్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు...
    626 Views
  • మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
    మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, ఐసీయూ, ట్రామాకేర్ సేవల లోపాలు, రోగులను తరచూ ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మహాప్రస్థానం వాహనం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి...
    175 Views
  • నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
    గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వ్యవసాయ పొలం నుంచి వరిగడ్డిని ఇంటికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. వాహనం నుంచి దిగేందుకు ప్రయత్నించగా, కాలు ట్రాక్టర్ చక్రాల్లో ఇరుక్కుని గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
    266 Views
  • నిమ్మనపల్లె: పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రశంసాపత్రం.
    నిమ్మనపల్లె మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి గ్రామ పరిపాలన, పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసాపత్రం గురువారం అందుకున్నారు. పంచాయతీలో అభివృద్ధి పనులు, పరిశుభ్రత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా కడపలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకరరావు ఆమెకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను...
    213 Views
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్.
    అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గురువారం బహుజన సేన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ క్రైస్తవుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, రాజ్యాంగ హక్కులు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను ఆయన రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. హోదా కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత...
    176 Views
  • పెద్దమండ్యం రహదారిపై నీటి నిల్వ: దోమల భయం, ప్రజల ఆందోళన.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెద్దమండ్యం వద్ద ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉండే అంతర్గత రహదారి మలుపు వద్ద నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. దీనివల్ల వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వర్షాకాలంలో ఈ నీరు దోమలకు ఆవాసమై జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తీవ్రం కాకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.
    234 Views