Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • దారేది?
    కొందుర్గు భారత్ ఆవాజ్ న్యూస్:
    ఒకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ గుంతలు. ఇంకోవైపు ఎక్కితే దిగలేని దిగితే ఎక్కలేని స్పీడ్ బ్రేకర్, ఆ మధ్యలో బొడ్రాయి.
    కొందుర్గు మండలకేంద్రంలోని కొందుర్గు-చిన్న ఉమ్మెంత్యాల రోడ్డులో గల గాడిబాయి హనుమాన్ టెంపుల్ వద్ద దుస్థితి ఇది.

    ఈ పరిస్థితి వల్ల వాహనదారులకు మరియు పాదాచారులకు చాలా ఇబ్బందిగా ఉంది. మరోవైపు మరమ్మత్తుల కోసం డ్రైనేజీ గుంతలు తీసి రోజులు గడుస్తున్నా, పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. రోజూ ఆ మార్గంలోనే ప్రయాణించే అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా ఉంటున్నారు.
    519 Views
  • ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు
    ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక – పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు...
    200 Views
  • చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
    చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దర్శి మండలం చందలూరు గ్రామంలో MGNREGS నిధులతో చేపట్టిన పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యాన పంటలు రైతులకు స్థిరమైన ఆదాయ వనరులని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఉద్యాన పంటల సాగు...
    225 Views
  • తేది:-24-06-2026,గిద్దలూరు ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన
    ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సీఎం వో ప్రతినిధి డానిష్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు. ఈ సందర్భంగా సీఎం హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న పనులు, ప్రజా వేదిక, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న...
    278 Views
  • దర్శి టిడిపి ఇన్చార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి పర్యటన వివరాలు
    * 🙏 *టీడీపి - జనసేన - బిజెపి కుటుంబ సభ్యులు అందరికి నమస్కారం* 🙏 తేదీ : 25-06-2026, ఈరోజు దర్శి టీడీపి ఇంచార్జ్ గౌ|| శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు   ఉదయం : 11.00 గంటలకు దర్శి పట్టణం, పొదిలి రోడ్ లోని పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారహి గోల్డ్ రికవరి & బయర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు.  ఉదయం : 11.30 గంటలకు దర్శి పట్టణం,...
    271 Views
  • రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ గార్లు
    రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో గంటావానిపల్లిలో చేపట్టిన ఏర్పాట్లు మరియు భద్రతా...
    211 Views
  • ఈరోజు (24-06-2026) సాయంత్రం కనిగిరి పట్టణంలోని MBR ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డి. విజయ్ కుమార్ గారు (టెక్నికల్ ఆఫీసర్, PR QA & QC డివిజన్, పర్చూరు) పదవీ విరమణ సన్మాన కార్యక్రమo
    ఈరోజు (24-06-2026) సాయంత్రం కనిగిరి పట్టణంలోని MBR ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డి. విజయ్ కుమార్ గారు (టెక్నికల్ ఆఫీసర్, PR QA & QC డివిజన్, పర్చూరు) పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ ముక్కు కాశీ రెడ్డి గారు డి. విజయ్ కుమార్(బాబ్జి ) గారిని...
    208 Views
  • పుంగనూరు మండలంలో అగ్ని ప్రమాదం కొత్తూరు మురళి
    పుంగనూరు మండలం, చదల్ల గ్రామంలో బుధవారం రాత్రి రవి అనే రైతుకు చెందిన వెదురు పొదలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 2000 నష్టం వాటిల్లింది# కొత్తూరు మురళి.
    277 Views
  • పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
    పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సేవాలాల్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 8 తండాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం, సమాజ సంస్కర్త అయిన సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనలో భాగంగా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని కమిటీ...
    215 Views
  • చీమనపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి కొత్తూరు మురళి
    పుంగునూరు మండలం చీమనపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డుపై వెళ్తున్న సుమారు 55-60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    241 Views