Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిమ్మనపల్లె: యువత గాంజా, మత్తుకు బానిస కావద్దు: ఎస్సై.
    నిమ్మనపల్లె ఎస్సై రామకృష్ణ ఆదివారం యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువత గాంజా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేదంటే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమానితులకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాంజా విక్రయాలు, రవాణాపై సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు.
    226 Views
  • కార్మికులకు జీతాలు పెంచలేని ప్రభుత్వానికి సంబరాలెందుకు?: CITU.
    కార్మికులకు కనీస వేతనాలు పెంచలేని ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు విమర్శించారు. ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ, 2006-07 తర్వాత రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు జరగలేదని, కార్మికులకు నెలకు కనీసం రూ. 26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేపడతామని...
    344 Views
  • తనిఖీలు చేస్తున్న ఆర్టీవో పై నుంచి వెళ్లిన బొగ్గు లారీ.....
    అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన అధికారి ఆర్టీవో కార్యాలయం ముందే బీభత్సం సృష్టించిన బొగ్గు లారీ... భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి (ఆర్టీవో) వెంకన్న రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు బొగ్గు లారీలను చెక్ చేస్తున్న క్రమంలో అతివేగంతో...
    328 Views
  • మదనపల్లె: భూ వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ.
    శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలోని ఎనమలవారిపల్లెలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కుమారుడితో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సునీల్ కుమార్, త్రిలోక్ కుమార్ వర్గాల మధ్య భూ వివాదం గొడవకు దారితీసిందని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి...
    221 Views
  • నిద్రమత్తు ప్రమాదాలకు చెక్.. 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'.
    అన్నమయ్య జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, అర్ధరాత్రి తర్వాత ప్రయాణించే వాహనాల డ్రైవర్లను ఆపి, వారి నిద్రమత్తును పరిశీలించి, చల్లటి నీటితో ముఖం కడిగించి, అప్రమత్తంగా ఉన్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని సూచిస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రమాద రహిత జిల్లాగా...
    214 Views
  • శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి స్వీకరించిన సంచిత్ గంగ్వార్.|
    మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి అమలు చేయాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న బీహెచ్‌ఈఎల్ రోడ్డు అభివృద్ధి పనులు, హరిజన్ బస్తీ శ్మశానవాటిక అభివృద్ధి...
    270 Views
  • శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి స్వీకరించిన సంచిత్ గంగ్వార్.|
    మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి అమలు చేయాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న బీహెచ్‌ఈఎల్ రోడ్డు అభివృద్ధి పనులు, హరిజన్ బస్తీ శ్మశానవాటిక అభివృద్ధి...
    46 Views
  • ఘనంగా సీఎం విజయ్ జన్మదిన వేడుకలు
    చిత్తూరు ( భారత్ఆవాజ్) చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమిళనాడు సీఎం విజయ్ కు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం,  ధనుష్, కిరణ్, బాబు, రోహిత్,గురు, యశ్వంత్, భరత్ పాల్గొన్నారు
    485 Views
  • తెలంగాణ : కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్....!
    సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా నిందితులందరూ న్యాయస్థానానికి హాజరయ్యారు. వర్చువల్ విచారణకు కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఆయన తరపు లాయర్ పిటిషన్ వేయగా మెమో దాకులు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ జూలై 6 కు వాయిదా వేసింది. అప్పుడు కూడా వర్చువల్ గా  హాజరవుతారని అల్లు అర్జున్ లాయర్ కోర్టుకు తెలిపారు.
    391 Views
  • తెలంగాణ : ఆధార్ ఈమెయిల్ అప్డేట్ చేసుకున్నారా ....!
    ఆధార్ ఏమీలో ఆరు నెలల పాటు ఆధర్ మొబైల్ యాప్ లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని UIDAI ప్రకటించింది. ప్రస్తుతం యాప్లో దీనికోసం వినియోగదారులు 75 చెల్లించాల్సి వస్తుంది. అయితే వచ్చే నెల ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు ఈ చార్జను మాఫీ చేయనున్నట్టు UIDAI వెల్లడించింది. యాప్ ద్వారా చేసే అప్డేట్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆధార్ తో మెయిల్ లింకుపై ఉండే ఎప్పటికప్పుడు అప్డేట్ పొందవచ్చు అని పేర్కొంది.
    452 Views