Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జాహ్నవి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్
    AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచింది. చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. పామాయిల్ తోటలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి కనిపించకుండా పోయింది. చిన్నారితోపాటు వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. తాజాగా కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.  
    566 Views
  • ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం: ప్రాణదాతలుగా మారండి
    ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 15న ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులైన ఎవరైనా రక్తదానం చేయవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చని మెడికల్ ఆఫీసర్ భార్గవ్ తెలిపారు. రక్తనిధి ఇన్చార్జ్ దిలీప్ మాట్లాడుతూ, స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అత్యవసర సమయంలో...
    218 Views
  • SIR వర్క్ షాప్ కార్యక్రమంలో
    ఎమ్మిగనూరులోని అజంత ఫంక్షన్లో నిర్వహించినElection commission of India special intensive revision (SIR) వర్క్ షాప్ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీనివాసులు గారు( MRO గారు), గంగిరెడ్డి గారు (మునిసిపల్ కమిషనర్) గారి తో పాటు బిజెపి అసెంబ్లీ మాజీ కో కన్వీనర్ తోగట నరసింహులు,బిజెపి పట్టణ అధ్యక్షులు కోరిశెట్టి జట్టప్ప ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు ఉప్పర వెంకటేశ్వర్లు,బిజెపి సీనియర్ నాయకులుగణప వీరేష్ తదితరులు...
    464 Views
  • జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని 40 పడకలుగా అభివృద్ధి చేయాలి మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆత్రం సుగుణక్క వినతి
    🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్   జైనూర్ మండలం కొమురం భీం  ఆసిఫాబాద్ జిల్లా: జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గ వెంటనే 40 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి...
    351 Views
  • ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ '360 యాప్' పోస్టర్ల ఆవిష్కరణ
    🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి మరియు మాజీ శాసనమండలి సభ్యులు లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సామాజిక మాధ్యమాల ప్రచార '360 యాప్' ప్రచురణ పత్రాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రస్తుత...
    497 Views
  • పెద్దపల్లి : రేపు కరెంటు బంద్
    33/11 కె.వీ రంగంపల్లి సబ్ స్టేషన్ లో ధర్మం పనుల కారణంగా రేపు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు విద్యుత్ శాఖలో అంతరాయం ఏర్పడినట్టు అదనపు సహాయం ఇంజనీరు సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు.  పెద్ద బొంకూర్, పెద్దకాల్వల , నిట్టూరు పెద్దపల్లి రంగంపల్లి నిమ్మనపల్లి గ్రామాల వినియోదారులు సహకరించి గమనించాలని కోరారు.
    223 Views
  • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన వరి ధాన్యం కొనుగోళ్లు 14,962 మెట్రిక్ టన్నుల సేకరణ
    🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి 2025-26 కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శుక్రవారంతో విజయవంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,034 మంది రైతుల నుంచి 14,962 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగిందని,...
    351 Views
  • పెద్దపల్లి : కోటి రూపాయల విలువైన గంజాయి ధ్వంసం ధ్వంసం...!
    రామగుండం కమిషనరేట్ పరిధిలోని 53 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 200 కిలోల గంజాయి 34 ముక్కలను, కోర్ట్ అనుమతితో ధ్వంసం చేసినట్టు సీపీ అంబర్ కిషోర్ గారు తెలిపారు. ఈదుల గట్టుపల్లి లోనే ఇన్సులేటర్ లో పర్యావరణ నిబంధనల ప్రకారం వీటిని ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందన్నారు. గంజాయి  విక్రయించిన, సేవించిన పీడీ యాక్ట్ పెడతామని సిపి హెచ్చరించారు. డిసిపి రామిరెడ్డి గారు, ఏసీబీ రమేష్...
    243 Views
  • కరీంనగర్ : యువతి పైకి దూసుకెళ్లిన క్రేన్...!
    కరీంనగర్ నగరంలోని గీత భవన్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న ఒక యువతిపైకి క్రేన్ దూసుకెల్లడంతో  ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలు  ధర్మారం మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన యువతీగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి స్పందించి  తన పోలీసు వాహనంలోనే క్షేత్రగత్రాన్ని ఆసుపత్రులకు తరలించారు.
    251 Views