బాపట్లలో రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ప్రారంభోత్సవం బాధితుల చిరునామా రెడ్ క్రాస్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

0
237
 
 
బాపట్ల జిల్లా: బాధిత జనావళికి అండగా, వారికి బాసటగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిరూపమాన సేవలు అందిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. విశిష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కు గుర్తింపు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. బాపట్ల తాహసిల్దార్ కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో విస్తరించేలా జరుగుతున్న కృషి అభినందనీయమని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఇందులో జిల్లా చైర్మన్ నారాయణ భట్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. ప్రకృతి వికృత రూపానికి తల్లడిల్లే ప్రాంతాల్లో నేను సైతం అంటూ రెడ్ క్రాస్ ముందుండి సేవలు అందిస్తుందని అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు భోజన ఏర్పాట్లు చేయటం ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకుందని తెలిపారు. బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్పటికే
రెడ్ క్రాస్ మంచి గుర్తింపును సాధించిందని చెప్పారు. ఇదే సందర్భంగా ప్రజలకు మంచి సేవలు అందించే ప్రత్యామ్నాయ సేవలపై కూడా రెడ్ క్రాస్ దృష్టి పెట్టాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్రస్థాయిలో సభ్యత్వ నమోదులో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కు అవార్డు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో మంచి సేవలతో గుర్తింపు పొందిన రెడ్ క్రాస్ కు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత విస్తరింప చేసే కార్యకలాపాల కోసం అనువైన భవనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల ఆర్డిఓ గ్లోరియా, తాసిల్దార్ షేక్ షలీమ, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ కు సహకరిస్తున్న దాతలను ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానించారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
""అరైవ్ అలైవ్".. చిన్నారులకు ట్రాఫిక్ భద్రత పాఠాలు.|
"ఆల్వాల్ కిడ్జ్ స్కూల్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం.. మైనర్ డ్రైవింగ్, అతివేగంపై...
By Sidhu Maroju 2026-06-29 11:47:54 0 339
Telangana
బూత్‌లపై పట్టు.. విజయానికి మెట్టు.|
● బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన ● బూత్‌ల వారీగా వివరాలు,...
By Sidhu Maroju 2026-07-29 07:59:48 0 115
Andhra Pradesh
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా, బీమా కలిపి మొత్తం...
By Chennaiah Kati 2026-07-14 03:29:36 1 200
Andhra Pradesh
గాలిబ్ షాహిద్ దర్గా భూములు కాపాడండి
*ఖిల్లా హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములు కాపాడండి*   *అల్తాఫ్ బాబాకు దర్గా ముజావర్ల వినతి...
By Rajini Kumari 2026-03-28 14:12:21 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com