ప్రేమ వ్యవహారంలో పగ పెంచుకుని యువకుడి హత్య.. చీరాలలో దారుణ ఘటన ఐదుగురు నిందితుల అరెస్ట్

0
217

చీరాల:  చీరాల పట్టణంలోని రైల్వే ట్రాక్ పక్కన, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో కొండే త్రినాథ్ (19) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు కొండే త్రినాథ్ గత నాలుగేళ్లుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అదే యువతికి నాలుగు నెలల క్రితం ముద్దయి (A1) పరిచయం కావడంతో ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో ఆ యువతి, త్రినాథ్ కలిసి ఒక లాడ్జ్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను A1 ముద్దయి A2 షేక్ గౌస్ వీడియోగా చిత్రీకరించినట్లు సమాచారం. ఆ వీడియోను డిలీట్ చేయాలని త్రినాథ్ A1ను కోరినా, అతడు అంగీకరించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.
త్రినాథ్ కారణంగానే ఆ యువతి తనకు దూరమైందనే భావనతో A1 ముద్దయి అతనిపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా త్రినాథ్‌ను అడ్డుతప్పించాలనే ఉద్దేశంతో, జనవరి 27, రాత్రి “మందు తాగుదాం” అంటూ త్రినాథ్‌ను పిలిచాడు. హరిప్రసాద్ నగర్‌లోని వైన్ షాప్ వద్ద బైక్ నిలిపి, ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ పక్కన కూర్చుని మద్యం సేవిస్తున్న సమయంలో, A1 తన స్నేహితుడు A2కి ఫోన్ చేసి ఇతరులను కూడా అక్కడికి రమ్మని పిలిచాడు.
అనంతరం A2తో పాటు అతని స్నేహితులు A3 వల్లెపు దేవహర్ష (19), A4 శీలం భగవంతుడు, A5 కేదరువెల్లి చంద్రప్రకాశ్ అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న త్రినాథ్‌ను చంపడానికి ఇదే సరైన సమయమని A1 వారిని రెచ్చగొట్టాడు. యువతి విషయాన్ని ప్రస్తావిస్తూ త్రినాథ్‌ను రెచ్చగొట్టగా, అతడు కోపంతో A1పైకి రావడంతో, A1 బీరు బాటిల్‌తో త్రినాథ్ తలపై బలంగా కొట్టాడు. బాటిల్ పగిలి తలకు తీవ్రమైన గాయం అయింది.
అదే సమయంలో A2, A3 త్రినాథ్‌ను పట్టుకోగా, A1 అతని తల, మెడ, వీపు, ముఖంపై పలుమార్లు ఇష్టానుసారం పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో త్రినాథ్ కుప్పకూలిపోయాడు. అయినా కసి చల్లారక, A1 సమీపంలో ఉన్న పెద్ద సిమెంట్ స్లాబు రాయితో ముఖం, ఛాతిపై మూడు–నాలుగు సార్లు కొట్టడంతో త్రినాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. రక్తంతో ముడుచుకున్న A1 బట్టలను A4 ఇంటి వెనుక ఉన్న స్మశానంలో A1, A3, A4, A5 కలిసి తగులబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం పోలీసులకు దొరకకుండా పారిపోదామని A1 ఇంటి వద్ద సమావేశమై చర్చించుకుంటున్న సమయంలో, పోలీసులు దాడి చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులకు ఎస్పీ అభినందనలు
ఈ కేసును ఛేదించడంలో చీరాల డీఎస్పీ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ ఎస్. సుబ్బారావు, ఎస్‌ఐ జి. రాజ్యలక్ష్మి, పీఎస్‌ఐ వెంకటేశ్వర రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు పి. రామారావు, పి. వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పి. రాజు, ఎన్. భాస్కర్, ఎం. నాగరాజు, జి. బ్రహ్మయ్య, డి. రవి మరియు హోంగార్డులు అంకమ్మలతో రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని జిల్లా, ఎస్పీ అభినందిస్తూ  రివార్డులు ప్రకటించారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
"SIR జోరు.. బండబస్తీలో ఇంటింటి దౌరు.|
● బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ, కుమ్మరి బస్తీల్లో విస్తృత ప్రచారం. ● ప్రతి కుటుంబాన్ని...
By Sidhu Maroju 2026-07-23 07:04:54 0 150
Andhra Pradesh
Chandrababu Naidu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 1) నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు...
By Pagadala Venkateswar 2026-03-31 10:47:35 0 212
Andhra Pradesh
నందిగామలో కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ
నందిగామ,పాత బస్టాండ్ లో ఉన్నటువంటి పురాతనమైన కోనేరు పుష్కరిణి చుట్టూతా ఉన్న ఆక్రమణలను హైకోర్టు...
By Patan Khuddus 2026-04-29 15:32:50 0 304
Andhra Pradesh
అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-04-18 14:12:04 0 277
SURAKSHA
Architect of Modern Policing: Dr. Sagar Preet Hooda, IPS
Visionary Leadership, Global Academic Acumen, and Decades of Unwavering Commitment to Public...
By Kalaga Sailaja 2026-07-28 11:00:11 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com