బాపట్లలో SAAP లీగ్–2026 జిల్లా స్థాయి చెస్ పోటీలు

0
248
బాపట్ల జిల్లా: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ,జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (District Sports Authority), బాపట్ల ఆధ్వర్యంలో SAAP League – 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి చెస్ పోటీలు బాపట్ల పట్టణంలో బాపట్ల రేంజర్స్ సంయుక్త సహకారముతో. ఈ రోజు ఉదయం ఘనముగా ప్రారంభమయ్యాయి.
గౌరవ బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ వి.వినోద్ కుమార్ I.A.S గారి సూచనల మేరకు ఈ చెస్ పోటీలు 17 ఫిబ్రవరి 2026 నుండి డిసెంబర్ 22 వరకు K.V.K ఇండోర్ స్టేడియం, ఉప్పరపాలెం రోడ్డు నందు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారిణి శ్రీమతి P. గ్లోరియా గారు హాజరై క్రీడలను ప్రారంభించి మాట్లాడుతూ, చెస్ వంటి మేధస్సును పెంపొందించే క్రీడలు విద్యార్థులలో ఆలోచనా శక్తి, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను విస్తృతంగా ప్రోత్సహిస్తూ, ప్రతి జిల్లాలో క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తున్నదని అన్నారు.
అలాగే యువత చెస్‌లో ప్రతిభ కనబరచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
జిల్లా లోని పలు విద్యాసంస్థల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు.
ఇక ప్రస్తుత జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరచిన క్రీడాకారులు డిసెంబర్ 21న తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు అని నిర్వాహకులు తెలిపారు.
“Transforming Andhra Pradesh into a Sporting State” లక్ష్యంతో SAAP లీగ్–2026 కార్యక్రమం కొనసాగుతున్నదని, ఇందులో భాగంగా నిర్వహించే ఈ చెస్ పోటీలను క్రీడాకారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమునందు మునిసిపల్ కమీషనర్ శ్రీ.జి.రఘునాధ రెడ్డి గారు తహశీల్దార్ శ్రీమతి షేక్ సలీమా గారు ,జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి యస్.శ్రీనివాస రావు గారు,జిల్లా క్రీడా రాయబారి కుమారి అనురాధ మరియు కోచ్ లు,వివిధ పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
SURAKSHA
Hari Prasad Chettri IPS: Safeguarding Borders with Leadership
A distinguished IPS officer of the Sikkim Cadre, Shri Hari Prasad Chettri has dedicated his...
By Lokeshwari Panthadi 2026-07-28 10:40:56 0 130
Telangana
బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు
జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు....
By Thativar Shivaji 2026-01-26 14:44:00 0 748
Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.
అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్  గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-16 06:24:57 0 220
Andhra Pradesh
నెల్లూరు రూరల్ వైసీపీకి రాజీనామాల పరంపర
*నెల్లూరు రూరల్ వైసీపీ కి రాజీనామాల పరంపర*  *ఆమంచర్ల పంచాయతీలో అప్పయకండ్రిగ వైసీపీ ముఖ్యనేత...
By Rajini Kumari 2025-12-21 12:32:20 0 320
SURAKSHA
Anoop Kuruvila John, IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "The true strength of policing lies not only in enforcing the law but also in...
By Fathima Safa 2026-07-16 09:36:02 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com