వైభవంగా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

0
589

​- పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ సీతక్క ​

మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 16(భారత్ అవాజ్)తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొత్తగూడ మండలం శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర మహోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, ఆర్ అండ్ బి శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఘనంగా ఆవిష్కరించి ​జాతర ముఖ్య తేదీలను ప్రకటించారు.​వచ్చే మార్చి నెలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర జరగనుంది. జాతర వివరాలు ఇలా ఉన్నాయి: ​మార్చి 04 ముత్యాలమ్మకు బోనాలు సమర్పించుట. ​మార్చి 05 అమ్మవారిని వనం నుండి గద్దె మీదకు తీసుకురావడం (ప్రధాన ఘట్టం). ​మార్చి 06 భక్తుల మొక్కుల చెల్లింపు, అనంతరం అమ్మవారి తిరుగు ప్రయాణం (వన ప్రవేశం).​ఈ కార్యక్రమంలో జాతర ఇంచార్జ్ ఈవో అనిల్ కుమార్, ఆలయ ప్రధాన పూజారి తోలేం చిన్న నర్సయ్య,తోలం కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు, వెంకన్న, కిరణ్ కుమార్, రాంబాబు, నవీన్ పాల్గొన్నారు. అలాగే ఆలయ సిబ్బంది బట్టు వెంకన్న, గుంజేడు సర్పంచ్ తోలం అనంతరావు, బుర్కా నరేందర్, మల్లేష్, బీజ్జ సందీప్ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Gujarat
New Govt Push: Protecting Eco-Sensitive Zones in India
he central government is accelerating the identification of Environmentally Sensitive Areas (ESA)...
By Lokeshwari Panthadi 2026-07-01 06:37:36 0 153
Andhra Pradesh
పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన చిన్న రాయల్.
రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ జనసేన...
By Kothuru Murali 2026-01-22 12:01:15 0 230
Rajasthan
SC Issues Contempt Notice Over Rajasthan Pollution Board’s Staffing Shortfall
The Rajasthan State Pollution Control Board (RSPCB) is under judicial scrutiny as the Supreme...
By Bharat Aawaz 2025-07-17 07:36:54 0 1K
Telangana
భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల...
By Sriramula Anil 2026-08-19 14:35:57 0 182
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు
పుంగనూరు పట్టణంలో శనివారం రాత్రి కొత్త ఇండ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను ప్రకాష్ (26) అనే...
By Kothuru Murali 2026-05-31 16:16:51 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com