వైభవంగా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

0
590

​- పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ సీతక్క ​

మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 16(భారత్ అవాజ్)తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొత్తగూడ మండలం శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర మహోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, ఆర్ అండ్ బి శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఘనంగా ఆవిష్కరించి ​జాతర ముఖ్య తేదీలను ప్రకటించారు.​వచ్చే మార్చి నెలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర జరగనుంది. జాతర వివరాలు ఇలా ఉన్నాయి: ​మార్చి 04 ముత్యాలమ్మకు బోనాలు సమర్పించుట. ​మార్చి 05 అమ్మవారిని వనం నుండి గద్దె మీదకు తీసుకురావడం (ప్రధాన ఘట్టం). ​మార్చి 06 భక్తుల మొక్కుల చెల్లింపు, అనంతరం అమ్మవారి తిరుగు ప్రయాణం (వన ప్రవేశం).​ఈ కార్యక్రమంలో జాతర ఇంచార్జ్ ఈవో అనిల్ కుమార్, ఆలయ ప్రధాన పూజారి తోలేం చిన్న నర్సయ్య,తోలం కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు, వెంకన్న, కిరణ్ కుమార్, రాంబాబు, నవీన్ పాల్గొన్నారు. అలాగే ఆలయ సిబ్బంది బట్టు వెంకన్న, గుంజేడు సర్పంచ్ తోలం అనంతరావు, బుర్కా నరేందర్, మల్లేష్, బీజ్జ సందీప్ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్
జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు...
By Karapati Gopi 2025-12-27 14:53:57 0 523
Odisha
Odisha's ₹90,000 Crore Railway Infrastructure Boost
Odisha is currently undergoing a massive transformation in its railway connectivity, with...
By Lokeshwari Panthadi 2026-07-02 07:38:55 0 108
Andhra Pradesh
శ్రీ వారి భక్తులు కు అలెర్ట్ ఈ రోజు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనాల ఆ టోకెన్లు రద్దు
తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇవాళ అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార...
By Karapati Gopi 2025-12-29 05:58:14 0 345
SURAKSHA
Shri Robin Hibu, IPS: Inspiring Lives Through Service and Leadership
A distinguished IPS officer whose fearless policing, compassionate leadership, and unwavering...
By Kalaga Sailaja 2026-07-28 10:33:24 0 118
Telangana
లా అభ్యర్థులకు అలర్ట్ టీజీ లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
🎤భారత్ ఆవాజ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ న్యాయ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం TG...
By Chunarkar Jagadeesh 2026-06-27 06:26:43 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com