భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత

0
172

పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల బియ్యాన్ని భూపాలపల్లి పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు రేగొండ మండల కేంద్రంలో గల పాత రైస్ మిల్ గోదాములో తనిఖీలు నిర్వహించగా భారీ ఎత్తున PDS బియ్యం బస్తాలు గుర్తించారు.ఇట్టి సమాచారాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మరియు జిల్లా మేనేజర్ కు తెలియపరచగా ,వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి లభ్యమైన మొత్తం బియ్యం PDS బియ్యంమే అని ప్రాథమికంగా నిర్ధారించారు. తదుపరి బియ్యం బస్తాలను లెక్కించి పంచనామా నిర్వహించి సుమారు 444.75 క్వింటాళ్ల బియ్యంగా నిర్ధారణ చేసారు.ఇట్టి బియ్యాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు సమీపంలో గల మారుతి రైస్ మిల్ లో భద్రపరిచినట్టు అధికారులు పేర్కొన్నారు.ఇట్టి బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన పాత రైస్ మిల్ యజమాని శ్రీనివాస్ మరియు వాహన డ్రైవర్లు తూర్పాటి శ్రీనివాస్, సాంబశివుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం పోలీసులకు అప్పగించారు.

 

ఇంత భారీ స్థాయిలో రేషన్‌బియ్యం పట్టుబడటంతో దీని వెనుక ఉన్న సరఫరా దారులు, బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు,ఎక్కడికి తరలిస్తున్నారు ఎవరికి చేరవేస్తున్నారో అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు, ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు.ఈ దాడులలో DSO కిరణ్, జిల్లా మేనేజర్ రాములు, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు, టెక్నికల్ అసిస్టెంట్ రాహుల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సెల్ఫోన్ లైట్లలో వైద్యం దౌర్భాగ్యం
కురుపాం నియోజకవర్గంలోని భద్రగిరి సీహెచ్సీలో విద్యుత్ సౌకర్యాలు సరిగా లేక రోగులకు సెల్ఫోన్ లైట్లలో...
By Boiena Rajesh 2026-08-27 03:48:01 0 104
Assam
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
By BMA ADMIN 2025-08-11 10:23:00 0 2K
SURAKSHA
G. Sparjan Kumar IPS: A Dynamic Force in Kerala Policing
The Journey Begins “The true strength of policing lies not merely in enforcing the...
By Fathima Safa 2026-07-10 05:06:55 0 246
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్–2K26 ఘనంగా జరిగింది. టీడీపీ నేత కట్టా దొరస్వామి, జిత్తు మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మదనపల్లెలో ఘనంగా రాష్ట్ర స్థాయి మెగా అల్టిమేట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్ట్ – పాల్గొన్న...
By Pagadala Venkateswar 2026-07-27 13:27:00 0 90
Andhra Pradesh
AP New Scheme: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభానికి రెడీ.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్దమైంది. గరుడ పేరుతో కొత్త...
By Pagadala Venkateswar 2026-01-13 12:00:59 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com