యువత సన్మార్గంలో పయనించాలి

0
569

జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న  మందిరము వద్ద పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ (మల్లయ్య గిరి & దేగల్ మడి ఆశ్రమ పీఠాధిపతి) యోగ సాధన శిబిరం నిర్వహించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే అభివృద్ధి పయనంలోకి వస్తారని పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ శిబిరం తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పూజ శ్రీ బసవలింగ అవధూత మహారాజ్ మాట్లాడుతూ:--- ప్రస్తుతం ఏ రంగం చూసిన యువతదే ప్రధాన పాత్రఉంటుందని, అలాంటి యువత దేవుడు సూచించిన సన్మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. విద్యా,వైద్య,రాజకీయం... ఇలా అన్ని రంగాల్లోనూ యువత అభివృద్ధిని సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు దైవంతో సమానమని వారిని నిత్యం పూజించాలని, గౌరవించాలని. జూదం,ల్లో మట్కా, గంజాయి, మద్యంల్లోఇలాంటితు చెడు వ్యాసనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేయకుండా ఉండాలని సూచించారు. ముగిసిన తరగతులు.... యోగ సాధానతో అన్ని రోగాలను అధిగమించవచ్చని పూజ శ్రీ బసవలింగ అవధూత పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తగిలి వచ్చారు. శిక్షణ తరగతులు సాగిన ఐదు రోజులపాటు అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

                                     రిపోర్టర్: శివాజీ

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : దక్షిణ మధ్య రైల్వే నోటీసు
అత్యవసర ట్రాక్ మరమ్మత్తుల కారణంగా లెవెల్ క్రాసింగ్ నెంబర్ 34/T(304/46-48) వద్ద రోడ్డు రవాణా (...
By Sunka Santhosh 2026-04-09 04:28:04 0 252
Andhra Pradesh
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...
By Pagadala Venkateswar 2026-01-31 08:01:08 0 180
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:40 0 251
Arunachal Pradesh
Monsoon Floods Devastate Agriculture in Arunachal
The ongoing monsoon floods in Arunachal Pradesh have dealt a severe blow to the agricultural...
By Lokeshwari Panthadi 2026-07-01 09:28:27 0 112
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com