చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు

0
224

బాపట్ల జిల్లా:  చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను  సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు. సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ శివరాత్రి ఉత్సవాలను సమర్ధవంతంగా నిర్వహించాలి. ఏటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నాం. భక్తులు రైల్వే ట్రాక్ దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆలయాల పరిసర ప్రాంతాలలో డ్రోన్లు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నాం.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగను జరుపుకోవాలి జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు

ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న మహాశివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని, బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సోపిరాలలోని రామకోటేశ్వర స్వామి దేవాలయం, కొత్తపాలెం గ్రామ పంచాయతీలోని బాల కోటేశ్వర స్వామి దేవాలయాలను గురువారం జిల్లా ఎస్పీ గారు సందర్శించారు. రెండు ఆలయ కమిటీల సభ్యులు జిల్లా ఎస్పీ గారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల పరిసర ప్రాంతాలను, క్యూలైన్ల ఏర్పాటును, సాంస్కృతిక కళా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలను మరియు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసే స్థలాలను ఎస్పీ గారు స్వయంగా పరిశీలించారు. అనంతరం రెండు ఆలయ కమిటీల ప్రతినిధులతో, సంబంధిత శాఖల అధికారులతో స్థానిక శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో ఎస్పీ గారు సమన్వయ సమావేశం నిర్వహించి, మహాశివరాత్రి తిరునాళ్లు విజయవంతంగా జరిగేలా అధికారులకు తగిన సూచనలు చేశారు.

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, దేవాదాయ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, జి.ఆర్.పి (GRP), ఆర్.పి.ఎఫ్ (RPF), ఆలయ కమిటీలతో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గత ఏడాది మహాశివరాత్రి రోజున సుమారు 30 వేల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అంచనాలు ఉన్నాయని, ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూ లైన్లు, బ్యారికేడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతామని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో వృద్ధులకు, చిన్న పిల్లలకు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా రెండు ఆలయాలకు వచ్చే భక్తులలో 80 శాతం మంది రైల్వే ట్రాక్‌లు దాటుకుని వస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని ఎస్పీ గారు హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జి.ఆర్.పి, ఆర్.పి.ఎఫ్ అధికారుల సమన్వయంతో తగినంత మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తామని, భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా తప్పిపోయిన పక్షంలో అనౌన్సింగ్ ద్వారా వారిని గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

నేరాలు జరగకుండా నిరోధించేందుకు మఫ్టీలో కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, మహిళా భక్తులు తమ ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భక్తులందరూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. 

ఈ కార్యక్రమంలో చీరాల ఆర్.డి.ఓ చంద్రశేఖర నాయుడు, డి.ఎస్.పి మోయిన్, ఎస్.బి ఇన్స్‌పెక్టర్ నారాయణ, ఇంకొల్లు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రమణయ్య, ఆలయ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు ఆలయ కార్యవర్గ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం... పడగొట్టినవి నిలబెడదాం: సీఎం చంద్రబాబు.
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు సమీక్ష రాయలసీమ, ప్రకాశం జిల్లాల...
By Pagadala Venkateswar 2026-01-28 08:03:56 0 181
Telangana
నిజామాబాద్
ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) జామ్...
By Sadaq Sadaq 2026-07-31 15:14:53 2 732
Andhra Pradesh
రజక మహిళపై ఓ కత్తితో దాడి చేతి వేళ్ళకు గాయాలు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన బాధిత కుటుంబ సభ్యులు రజకులు
చెరుకుపల్లి: నడింపల్లి గ్రామంలో చందోలు సామ్రాజ్యం అని రజక మహిళపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి...
By Gadiyapudi Narendra 2026-02-18 16:43:44 0 254
Telangana
ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్
ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ...
By Ponnala Srinivasrao 2026-05-06 05:00:59 0 183
Andhra Pradesh
తల్లి కష్టానికి ప్రతిఫలం.. కోర్టులో కుమారుడికి జాబ్
 రాజాం పట్టణంలోని ఎల్లయ్య నగర్కు చెందిన అరసాడ యువరాజు శ్రీకాకుళం జిల్లా కోర్టులో టైపిస్ట్...
By Boiena Rajesh 2026-08-22 05:28:17 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com