ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,

0
299

చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం చెరుకు పల్లిమండలం ఆరుంబాకపంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు రెడ్ క్రాస్ సంస్థ  ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనులకు నిత్యావసర వస్తువులను కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఎన్ని యానాది కుటుంబాలు ఉన్నాయని, అందులో ఎంత మందికి ఆధార్,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు ఉన్నాయా లేవాని పూర్తి సర్వే చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశించారు. మండలాల వారిగా యానాది కుటుంబాలు ఎంత మందికి ఆధార్ కార్డు లేదు,ఎంత మందికి రేషన్ కార్డు, ఎంత మందికి ఇంటి స్థలాలు ఉన్నాయా లేవని సర్వే చేయాలన్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు వస్తుందని తెలిపారు. ఎంత మందికి ఆధార్  లేదన్న జాబితా తయ్యారు చేసి ఆధార్ క్యాంపు లు పెట్టి ఆధార్ కార్డులు   తీయించుటకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిణి ఆదేశించారు.

బాపట్ల జిల్లా లోని నిరుపేదలైన యానాది కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా  నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా  ఆరుంబాక పంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు
10 యానాది  కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యవసర సరుకులు, దుస్తులు, ఒక బస్తా బియ్యం, కూరగాయలు, కిచెన్ కిట్లు, దుప్పట్లు, రగ్గులు, టార్పాలిన్ పట్టలను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ యన్.రామలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి అబ్భులు,తహశీల్దార్ సిహెచ్ పద్మావతి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు నారాయణ భట్టు,  పంచాయతీ సెక్రటరీ, వి ఆర్ ఓ , యానాది కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)

 

#Narendra

Search
Categories
Read More
Haryana
Haryana Strengthens Law and Order Through Technology
Haryana continues to enhance law and order through modern policing, digital surveillance, and...
By Fathima Safa 2026-06-30 13:19:10 0 158
Andhra Pradesh
చిల్లపల్లి శ్రీనివాస్ జన్మదినం: అన్నదానం చేసిన జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నీరుగుట్టువారిపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస...
By Pagadala Venkateswar 2026-02-11 11:22:30 0 192
Andhra Pradesh
కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు...
By Pagadala Venkateswar 2026-03-23 05:49:03 0 219
Telangana
నిజామాబాద్: పెదమతల్లి విగ్రహం ప్రతిష్ఠాపనలో పలుగొన్న మాజీ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్త
తేదీ:23.04.2026 నిజామాబాద్.ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో...
By Sadaq Sadaq 2026-04-23 07:37:36 0 167
Andhra Pradesh
20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.
మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:24:06 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com