జోరుగా హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 పోటీలు

0
227

*జోరుగా.. హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు*

 

*3వ రోజు 10 జట్ల మధ్య 5 మ్యాచ్‌లు*

 

మంగళగిరి టౌన్, డిసెంబర్ 23: రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు జోరుగా.. హుషారుగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో జేకేసీ యూత్ వర్సెస్ పీసీ వైల్డ్ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో జేకేసీ యూత్ విజయం సాధించింది. రఫ్ రైడర్స్ చినకాకాని వర్సెస్ వారాహి వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రఫ్ రైడర్స్ చినకాకాని జట్టు గెలుపొందింది. రైల్వే లైన్స్ వర్సెస్ యంగ్ స్టార్స్ సీకే మధ్య జరిగిన మాచ్య్ లో రైల్వే లైన్స్ జట్టు,6th బెటాలియన్ APSP వర్సెస్ రైజింగ్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 6th బెటాలియన్ APSP, టీమ్ భార్గవ పేట వర్సెస్ రన్ రైడర్స్ రెసిడెన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమ్ భార్గవ పేట జట్లు విజయం సాధించాయి. ప్రతీ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారుడికి మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ సహకారంతో రూ.మూడు వేల నగదు బహుమతి,ట్రోఫీ లను కూటమి నాయకులు అందజేశారు.

 

ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బిజ్ 51, సోనోవిజన్, హోటల్ డి దేవ్, తాడేపల్లి మెడ్ స్టార్ హాస్పటల్స్, సిగ్నేచర్ డైన్, హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, కోకోకోలా, వీ వైబ్ ఈవెంట్స్ వ్యవహరించనున్నాయి. ప్రతి మ్యాచ్‌ను గోపీ టీవీ యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది ప్రీమియర్ లీగ్ సీజన్-4 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ.3 లక్షలు మంగళాద్రి డెవెలపర్స్, ద్వితీయ బహుమతి కింద రూ 2 లక్షలు మంచికలపూడి వైష్ణవి, తృతీయ బహుమతి కింద రూ.లక్ష నగదును వెలగపూడి కిషోర్ సహకారంతో అందించనున్నారు. అలాగే ప్రతి మ్యాచ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.3 వేలు జవ్వాది కిరణ్ చందు, ప్రతి మ్యాచ్‌ టాస్ విన్నర్‌కు సిల్వర్ కాయిన్, అలాగే ఫైనల్ మ్యాచ్ టాస్ విన్నర్‌కు గోల్డ్ కాయిన్ రేవతి జ్యూయలరీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద ఎలక్ట్రానిక్ బైక్ వల్లభనేని భార్గవ్, బ్యాట్స్ మెన్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలుతో పాటు ఎలక్ట్రికల్ బై సైకిల్ కాసరనేని జస్వంత్, బౌలర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలుతో పాటు బై సైకిల్ గుత్తా కిషోర్, ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ రూ.25 వేలతో పాటు బైసైకిల్ తాడిబోయిన మహేష్, వికెట్ కీఫర్ ఆఫ్ ది సిరీస్ రూ. 25 వేలుతో పాటు బై సైకిల్ షేక్ ఇంతియాజ్‌లు అందించనున్నారు. మ్యాచ్‌లో పాల్గొన్న క్రీడాకారులకు టీ షర్ట్స్, ట్రాక్స్ అందజేస్తున్నారు

Search
Categories
Read More
Bharat Aawaz
🏳️‍⚧️ Transgender Rights in Delhi: A Step Forward
The Delhi government has introduced the Transgender Persons (Protection of Rights) Rules,...
By Citizen Rights Council 2025-07-23 13:54:43 0 2K
Andhra Pradesh
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి,...
By Pagadala Venkateswar 2026-05-08 05:19:27 0 134
Telangana
₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి
     కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా...
By Sidhu Maroju 2025-06-04 17:02:21 0 2K
BMA
Retaliatory FIRs: Silencing the Village Reporter
When village-level journalists expose illegal sand mining or Panchayat fund embezzlement, they...
By JoinBMA 2026-08-21 09:59:03 0 128
Andhra Pradesh
అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం
*విజయవాడ నగరపాలక సంస్థ*     *28-02-2026*   *అగ్ని ప్రమాద నిరోధక అవగాహన...
By Rajini Kumari 2026-02-28 12:40:18 0 340
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com