కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన

0
242

కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ప్రభావంతో కాకినాడ సముద్ర పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కార్మికుల పోరుకు మద్దతుగా కార్మిక సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. సముద్ర పోర్టులో కార్గో లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాలు ఆగిపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేలా ఈ కోడ్‌లు ఉన్నాయని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళారి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. వేతన సమరక్షణ, పని గంటల పెంపు, ఈపీఎఫ్, బోనస్ వంటి అంశాల్లో కార్మికులకు తుంగలో తొక్కేలా లేబర్ కోడ్ ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రియాజ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం భూములపై విలాస హవ
*అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం*  … *ప్రభుత్వ భూములపై విలాస హవా* !  ...
By Rajini Kumari 2026-04-13 07:59:51 0 175
Andhra Pradesh
నారా లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు: కట్టా దొరస్వామి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ...
By Pagadala Venkateswar 2026-01-23 10:59:38 0 223
Andhra Pradesh
విజయవాడ పడవ సేవ్ సెంటర్లో ఉద్రిక్తత
విజయవాడ ------    గుణదల పడవలరేవు సెంటర్ లో ఉధ్రిక్తత   గుణదల,మాచవరం కొండ...
By Rajini Kumari 2026-06-02 12:12:45 0 211
Andhra Pradesh
శుభారాం డిగ్రీ కాలేజీలో ముందుగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు
పుంగనూరులోని శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేషులు...
By Kothuru Murali 2026-01-07 02:34:59 0 207
SURAKSHA
Avula Ramesh IPS: Championing Smart Crime Policing
A dynamic 2007-batch IPS officer of the Tripura Cadre, Avula Ramesh has built a reputation for...
By Lokeshwari Panthadi 2026-07-27 04:56:14 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com