Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.

0
183

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన గుంటూరు కోర్టు

సీఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఊరట

రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

 

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

 

గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సీఐని అడ్డుకున్నారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ కావడంతో, పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

 

ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన గుంటూరు కోర్టు, తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, కోర్టు ఉత్తర్వులతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు...
By Sadaq Sadaq 2026-06-20 11:48:01 0 198
Telangana
మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’
ఏడాదంతా టైం పాస్ చేసి.. పరీక్షల టైంలో కొందరు విద్యార్ధులు నానాతంటాలు పడుతుంటారు. పాస్ చేయమని...
By Ponnala Srinivasrao 2026-03-26 01:43:36 0 229
Andhra Pradesh
Chandrababu Naidu: నా మిత్రుడు అనునిత్యం నగరి కోసం తపించేవారు: సీఎం చంద్రబాబు.
కుప్పం తరహాలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం హామీ 2029 నాటికి నగరికి కృష్ణా జలాలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:35:41 0 189
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన...
By Gadiyapudi Narendra 2026-01-07 14:07:24 0 335
Andhra Pradesh
A P news
రేపటి నుంచి ఏపీలోని దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ,...
By G k Nookala 2026-03-17 09:28:28 0 539
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com