మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’

0
225

ఏడాదంతా టైం పాస్ చేసి.. పరీక్షల టైంలో కొందరు విద్యార్ధులు నానాతంటాలు పడుతుంటారు. పాస్ చేయమని ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి బతిమిలాడుకునే వారిని చూశాం.. పాస్ చేయకపోతే చంపేస్తానని బెదిరించే వాళ్లను కూడా చూశాం. ఈ ఏడాది అంతకు మించి అన్నట్లు మరో ఆణిముత్యం బయటకు వచ్చింది..

‎పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవుతారని.. తల్లిదండ్రులు గంపెడు ఆశలతో పెద్ద కాలేజీల్లో చేర్పించి, లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తుంటారు. అయితే వారి పిల్లలు మాత్రం ఫోన్లలో రీల్స్‌ చేయడానికి, సోషల్‌ మీడియాలో గంటల కొద్ది గడపడానికి ఆసక్తి చూపుతూ చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు. తీరా పరీక్షల సమయంలో అడ్డదారులు తొక్కుతుంటారు. సాధారణంగా ఇలా టైం పాస్‌ చేసే విద్యార్ధులు ఆన్సర్ షీట్లలో తమను పాస్‌ చేయాలని టీచర్లను రకరకాలు వేడుకుంటూ ఉంటారు. కొందరు ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టి పాస్‌ చేయమని బతామాలుకుంటే.. మరికొందరు సినిమా స్టోరీలు, పాటలు రాసి పేజీలు నింపేస్తుంటారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు పూర్తవడంతో సమాధాన పత్రాల మూల్యాంకనం చేపట్టారు. ఈ క్రమంలో పేపర్లు దిద్దుతున్న మాస్టర్లకు ఇలాంటి మరో ఆణిముత్యం తగిలింది. ఓ విద్యార్ధి ఆన్సర్ షీట్లో రాసిన సమాధానం, గీసిన బొమ్మలు చూసి ఎగ్జామినర్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో వెంటనే సదరు ఆన్సర్ షీట్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం రాశాడంటే.ఈ ఆన్సర్ షీట్‌లో సదరు విద్యార్థి.. ‘సార్.. నాకు అమ్మా నాన్న లేరు సార్. మీరే నాకు అమ్మా నాన్న. నన్ను పాస్ చేయండి సార్. నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. మీరే నా దేవుడు సార్. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి’ అని వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా గురువు కాళ్లపై శిష్యుడు బోర్లా పడి నమస్కరిస్తున్నట్టుగా బొమ్మ కూడా గీశాడు. గురువు బొమ్మ దగ్గర ‘సార్’ అని, శిష్యుడి బొమ్మ దగ్గర ‘నేను’ అని రాసి సదరు విద్యార్థి తన టాలెంట్‌ చూపించాడు. ఈ మేరకు ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి మూల్యాంకుడిని వేడుకుంటూ రాసిన లేఖ నెట్టింట వైరల్ కావడతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఎంతకు తెగించార్రా’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా.. మరోకరు ‘ఇప్పుడు ఫెయిల్ ఐతే ఏంటంట? నీకు అర్థం అవుతుందా..’ అని కామెంట్ పెట్టారు. ఇంకా.. ‘వీడు పాసైన ఫెయిలైన జబర్దస్త్‌ లాంటి షోకి వెళ్తే ఫేమస్‌ అవుతాడు’, ‘ఇచ్చేయండి సార్.. పాస్ మార్కులు ఇచ్చేయండి’ అంటూ మీమ్స్‌తో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా తనకు తల్లిదండ్రులు లేరని, చదువుకున్నది గుర్తుకు రావట్లేదని, దయచేసి పాస్ చేయాలని విద్యార్థి వేడుకుంటున్న ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదుగానీ.. విద్యార్థి వేడుకుంటున్న విధానం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ రోడ్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్...
By Bonagiri RaviShankar 2026-06-12 05:29:55 0 241
Puducherry
CM–LG Standoff in Puducherry Ends with Temporary Truce
A power struggle erupted when Lt. Governor K. Kailashnathan unilaterally appointed a Health...
By Bharat Aawaz 2025-07-17 07:10:31 0 1K
BMA
Rights & Dignity
Upholding Fundamental Rights and Dignity of every individual in Bharat, Citizen Rights Council...
By Citizen Rights Council 2025-05-19 09:58:04 0 3K
SURAKSHA
Shaik Darvesh Saheb IPS: Leading Kerala Police with Integrity, Vision and Commitment
"The true strength of policing lies not only in enforcing the law but also in earning the trust...
By Fathima Safa 2026-07-08 07:24:49 0 211
Andhra Pradesh
కిష్టవరం టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేర భారీగా వాహనాలు , పట్టించుకోకుండా సర్వర్ ఇష్యూ అంటూ సిబ్బంది, ఎన్ని రోజులు ఈ అగపాట్లు అంటూ ప్రయాణికులు!
కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం,...
By Nandika Jayababu 2026-04-30 18:49:59 0 566
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com