సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|

0
235

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనర్.IPS. పోలీస్ వ్యవస్థ పట్ల సామాన్యుడిలో ఉండే భయాన్ని పోగొట్టి భరోసా నింపి లక్ష్యంతో ఆయన చేపట్టిన "మీట్ యువర్ సిపి" (Meet your C.P) కార్యక్రమం ఇప్పుడు నగరంలో ఒక సామాజిక విప్లవంగా మారుతోంది.

 

కాంతిరేఖల మీట్ యువర్ సిపి :

సాధారణంగా ఒక ఉన్నతాధికారిని కలవాలంటే సామాన్యుడికి ఎన్నో ఆంక్షలు, మరెన్నో అపాయింట్ మెంట్లు.

కానీ, సజ్జనర్ ఆ ఇనుపతొరలను తొలగించారు. 

 

బాధితుడు నేరుగా కమిషనర్ కళ్ళలోకి చూస్తూ తన గోడును వెళ్ళబోసుకునే అరుదైన వేదికను సృష్టించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటలవరకు, పాతబస్తీలోని చారిత్రాత్మక కోత్వాల్ హౌస్ లో శుక్రవారం మధ్యాహ్నం నుండి, అందుబాటులో వుంటారు. అక్కడ వినిపించేది బాధితుల గళం. కనిపించేది సి.పి పరిష్కారం.

 

గాడమైన అంతరార్థం : ఫిర్యాదు మాత్రమే కాదు భరోసా!

 

ఈ కార్యక్రమం కేవలం కాగితాలపై ఫిర్యాదులు తీసుకోవడమే కాదు; ఇది "విజిబుల్ పోలీసింగ్ లో ఒక భాగం."

 

క్షేత్రస్థాయి స్పందన : కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగడంతో, క్షేత్రస్థాయి అధికారులలో జవాబుదారీతనం పెరిగింది.

 

 

మానవీయ కోణం : గొడవలు, నేరాలే కాకుండా.. వృద్ధులు మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలకు ఇక్కడ తక్షణ ఓదార్పు లభిస్తోంది.

 

నమ్మకమే పునాది: ప్రజల నుండి వచ్చే సమాచారమే నేర నియంత్రణకు అసలైన ఆయుధమని నమ్మి సజ్జనర్,.. ఈ భేటీల ద్వారా ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నారు.

 

సజ్జనర్ మార్క్ పోలీసింగ్ :

 

గతంలో హైదరాబాద్ సిపి గా ఉన్నప్పుడు గానీ, ప్రస్తుత సిటీ కమిషనర్ గా ఉన్నా, ఆయన శైలి ఒక్కటే - "నేరస్తులకు సింహ స్వప్నం, బాధితులకు ఆత్మీయ నేస్తం" ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ కు వస్తే చిరునవ్వుతో ఆహ్వానించాలనే సంప్రదాయాన్ని ఆయన బలోపేతం చేస్తున్నారు. 

 

"పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి భయపడే రోజులు పోవాలి. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పౌరుడు ఒక ఇన్ఫార్మర్ కావాలి." అన్నది ఆయన ఆశయం. ఈ "మీట్ యువర్ సి.పి" కేవలం ఒక గంట ముచ్చట కాదు. ఇది ప్రజలకు, వ్యవస్థకు కలిగిన ఒక గొప్ప నమ్మకం.  

 

ముగింపు: ఖరీదైన కార్లలో తిరిగే సంస్కృతి నుండి, సామాన్యుడి కన్నీరు తుడిచే సంస్కృతి వైపు సజ్జనర్ చొరవ, ఇతర మెట్రో నగరాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. 

 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు...
By Gandla Vaijanath 2026-07-25 05:45:58 0 161
Andhra Pradesh
పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
పుంగనూరు మండలం వనమలదిన్నెలో కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుపై ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ...
By Kothuru Murali 2026-03-20 05:45:29 0 187
Telangana
మంచిర్యాల ఎంపీ కార్యాలయం లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో...
By Avunoori Mahesh 2026-04-21 06:33:37 0 212
Andhra Pradesh
Google data center opening on 28th
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం దగ్గర పడింది. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా...
By G k Nookala 2026-04-25 06:06:23 0 201
Telangana
ఆరెకుల సంఘం నూతనకార్యవర్గం
  వరంగల్ జిల్లా  ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు గీసుగోండ మండలo...
By Gujile Ramu 2026-04-23 07:39:34 0 291
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com