Jagan Mohan Reddy: జగన్ గుంటూరు పర్యటన... పలువురు నేతలపై కేసులు నమోదు.

0
221

గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్

జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన పలువురు వైసీపీ నేతలు

ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ కేసులు నమోదు

అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత చేపట్టిన గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. పోలీసు యాక్ట్ 30ను పట్టించుకోకుండా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లపాడులో పోతిన మహేశ్, బలసాని కిరణ్ కుమార్ పై కేసు నమోదయింది. మంగళగిరిలో నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, తాడేపల్లిలో దొంతిరెడ్డి వేమారెడ్డిపై, నగరంపాలెం ప్రాంతంలో పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, గుంటూరు పట్టాభిపురంలో అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి. 

 

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ... వైసీపీ నేతలు చేపట్టిన ర్యాలీల కారణంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
నకిలీ తుపాకి - ఆపై బెదిరింపు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ...
By Sidhu Maroju 2026-01-02 14:58:08 0 228
Andhra Pradesh
పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును...
By Kothuru Murali 2026-04-09 07:40:23 0 161
Telangana
నిజామాబాద్: నూతనబస్టాండ్ నిర్మాణానికీ ఎమ్మెల్యే వినతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిబస్‌స్టాండ్     ప్రయానికుల సౌకార్యాల...
By Sadaq Sadaq 2026-03-24 18:58:47 0 201
Telangana
అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ...ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులను చేపట్టి పూర్తిచేస్తాం : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డుకు...
By Sidhu Maroju 2025-06-12 11:39:04 0 1K
Punjab
Punjab Embarks on Historic Irrigation Project with Malwa Canal Construction
Chandigarh: In a historic initiative, the Punjab government under Chief Minister Bhagwant...
By BMA ADMIN 2025-05-20 08:30:22 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com