ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి

0
240

నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని నేలకొండపల్లి మండల విద్యాశాఖాధికారి బాలిన చలపతిరావు సూచించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం స్పెషల్ ఎడ్యుకేటర్స్ తో ప్రత్యేక సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ పాఠశాల లో విద్యార్థులను తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వారిలో ఉన్న లోపంను గుర్తించి ఆన్ లైన్ చేయాలని సూచించారు. విద్యార్థి లోపం ను గుర్తించిన తరువాత ప్రభుత్వం వారికి అవసరమైన యంత్రాలు, పరికరాలు, నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. జాతీయ విద్యా పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే సర్వే ను ఉపాధ్యాయులు బాధ్యత గా తీసుకోవాలని సూచించారు. తొలుత ఆయా పాఠశాలఉపాధ్యాయులు విద్యార్థుల లోపాలను గుర్తించాలని.. ఆ తరువాత స్పెషల్ ఎడ్యుకేటర్స్ రెండో విడత లో సర్వే చేసి నిర్ధారిస్తారని పేర్కోన్నారు. మండలంలోని రాజేశ్వరపురం, చెరువుమాధారం, నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నేలకొండపల్లి బాలికల ఉన్నత పాఠశాల లను నాలుగు క్లస్టర్స్ గా విభజించినట్లు తెలిపారు. మండలం లోని ప్రాధమిక పాఠశాలలు 40, ప్రాధమికొన్నత పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు 13 లో సర్వే ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. సర్వే గుర్తింపు లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
రిజర్వేషన్లు కుల ఆధారంగా కొనసాగాలా..? లేక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఉండాలా...?
దేశంలో రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి వేడెక్కే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు,...
By Ponnala Srinivasrao 2026-05-23 02:23:41 0 158
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు,...
By Kothuru Murali 2026-03-24 13:34:44 0 324
Andhra Pradesh
'బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో నష్టం'
బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-05 14:42:13 0 385
Telangana
"సీపీ సుమతి బాధ్యతల స్వీకారం… సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా బాధ్యతలు...
By Sidhu Maroju 2026-05-01 13:05:45 0 557
Andhra Pradesh
Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.
అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ   పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-03 06:54:50 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com