సముద్రంలో విద్యార్థుల గల్లంతు* పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు...

0
214

చిన్నగంజాం: పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు ఇద్దరు విద్యార్థుల గల్లంతు, ఇద్దరు క్షేమం రెవిన్యూ, పోలీస్, మెరైన్, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు పుట్టినరోజు వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, ఇద్దరు క్షేమంగా ఓడినే ఉన్నారు. చిన్నారుల గల్లంతుతో ఆయా కుటుంబాలు విషాదంతో వేదనకు గురవుతున్నారు.

 
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం,
పర్చూరు నియోజకవర్గం దుద్దుకూరు గ్రామానికి చెందిన చందులూరి శ్రీరామ్ (15) పుట్టినరోజు సందర్భంగా దుద్దుకూరు జడ్పీ హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న తోటి స్నేహితులు బిక్కి అవినాష్, తాటిపర్తి హేమంత్, గుంజి హేమవర్ధన్ నలుగురు విద్యార్థులు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఒక బైక్ మీద చిన్నగంజాం మండలం బాపయనగర్ బీచ్ దగ్గర సముద్రంలో మునగడానికి వెళ్లారు. అవినాష్, శ్రీరామ్ ఇద్దరు సముద్రంలో నీట మునిగి ఆచూకీ తెలియలేదు. హేమంత్, హేమ వర్ధన్ సముద్రం ఒడ్డునే ఉండటంతో క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, స్థానిక పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో ఆచూకీ లేకుండా పోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో జిల్లాలోని తీర ప్రాంతం ఉలిక్కిపడింది. విద్యార్థులు గల్లంతు కావడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :     నిత్యం ఇంటిని సాకే గృహిణి.   మంచిని...
By Sidhu Maroju 2025-12-02 12:07:52 0 309
Andhra Pradesh
ప్రత్తిపాడులో తృటిలో తప్పిన ప్రమాదం
ప్రత్తిపాడులో శుక్రవారం వైసీపీ ర్యాలీ అనంతరం గుంటూరు వైపు వెళ్తున్న సమయంలో ఒక టీవీఎస్...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:34:17 0 295
Telangana
'ఏఆర్ కె కిచెన్ లైవ్ కాన్సెప్ట్' ప్రారంభించిన మైనంపల్లి
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.        అల్వాల్ లోని ఏఆర్ కె...
By Sidhu Maroju 2025-08-08 17:32:02 0 866
Andhra Pradesh
44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..
జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల :...
By Gadiyapudi Narendra 2025-12-27 11:05:28 0 705
Telangana
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని...
By Sidhu Maroju 2026-03-28 06:50:31 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com