జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.

0
241
బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
ఘన వ్యర్థాలు నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తతో పర్యావరణానికి హాని, అనర్థాలను కలిగించే అంశాలను అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. మురుగునీటి నిర్వహణ విషయంలో అధికారులు అలసత్వం ఉండరాదన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త, ఘన వ్యర్ధాల సేకరణ జరగాలన్నారు. చెత్త, ఘన వ్యర్ధాల విభజన నిబంధనలనుసరించి చేపట్టాలన్నారు. ఘన వ్యర్ధాలు పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రాసెసింగ్ యూనిట్లకు పంపే అంశాలపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల పట్టణం నుంచి 35.7 టన్నుల చెత్త తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ఘన వ్యర్థాలను జిందాల్ ఫ్యాక్టరీకి పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. మురుగునీటిని పద్ధతి ప్రకారం పట్టణం నుంచి దిగువ ప్రాంతాలకు మళ్లించడం, బయటకు పంపడం, శుద్ధి చేసే యూనిట్ లను విస్తరింప చేయాలన్నారు.
ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, కమిటీ సభ్యులైన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు, తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి....
By Pagadala Venkateswar 2026-06-12 14:21:58 0 128
Andhra Pradesh
అంగన్వాడి కార్యకర్తలతో ముఖాముఖి చర్చలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2026-03-09 17:30:29 0 219
Andhra Pradesh
Collector, SP inaugurates sports competitions in Vizianagaram
Collector S. Ramsunder Reddy and SP Damodar jointly inaugurated the Amaravati Championship...
By Boiena Rajesh 2026-08-10 09:47:55 0 153
Telangana
బతుకుదెరువు కరువైంది కరుణించని ప్రభుత్వం
బతుకుదురువే కరువైంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆశ వర్కర్ల పరిస్థితి నిత్యం ప్రజాసేవలో ఉండే ఆశ...
By Kadari Komuravelli 2026-03-26 16:00:21 0 472
Telangana
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి
భీమారం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్దేశిత...
By Pinnehasan Odela 2026-04-09 14:31:54 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com