వేటపాలెం సమీపంలో టాటా ఏసీ ఆటోలో అగ్ని ప్రమాదం తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం

0
228

చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ  రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న ఒక టాటా ఏసీ ఆటోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ఆటో కింద నుంచి అకస్మాత్తుగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు నిలిపి, ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించివేశాడు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అవి తీవ్రరూపం దాల్చడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
తిమ్మసముద్రం నుంచి చీరాలకు బాడుగ నిమిత్తం వెళ్తున్న ఈ టాటా ఏసీ ఆటోలో డ్రైవర్‌తో పాటు బెజ్జం జడ్సన్, కాటేమ్ అన్నానియ్యా, మిరియాల సన్నీ అనే యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే అగ్ని ప్రమాదంలో ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలు జాకెట్లు
చిత్తూరు జిల ్ ల ా పుంగనూరుల ో ముందస్తు క్రిస్మస ్ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏసుప్రభువును...
By Kothuru Murali 2025-12-24 04:41:23 0 233
Telangana
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరిక
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: 28 జులై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ...
By Chunarkar Jagadeesh 2026-07-28 15:29:26 0 378
Andhra Pradesh
అంతర్రాష్ట్ర వాహన చోరీ దొంగ అరెస్ట్: కార్లు స్వాధీనం.
మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు....
By Pagadala Venkateswar 2026-04-23 03:37:17 0 132
Telangana
కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా? కాంగ్రెస్ ఎంపీ చామల
‎రూ. 135 కోట్ల భూస్కాం విషయంలో రేవంత్ సోదరుడికి కాంగ్రెస్ ఎంపీ చామల మద్దతు ‎కొండల్...
By Ponnala Srinivasrao 2026-08-13 01:30:01 0 210
Dadra &Nager Haveli, Daman &Diu
Industrial Showcase: Grand Finale of the Daman Book Fair
The mega Book Fair & Industrial Exhibition 2026 enters its final days at the Light House...
By Dunna Jessicaruth 2026-05-14 12:48:45 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com