GDCC బ్యాంక్, నల్లపాడు బ్రాంచ్ నందు నిధుల దుర్వినియోగం కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసిన గుంటూరు జిల్లా CCS పోలీసులు.

0
397

📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, CCS డీఎస్పీ శ్రీ బి.వి. మధుసూదనరావు గారి ఆధ్వర్యంలో, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన నిధుల దుర్వినియోగం కేసులో మరో(ఎనిమిదవ) నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది.

📍నల్లపాడు పోలీస్ స్టేషన్ నందు తేది 28.11.2025న నమోదైన కేసులో ముద్దాయి (A-8) అయిన పీటా.వెంకటేశ్వరావు ను తేది.02.02.2026 మధ్యాహ్నం 3.15 గంటలకు గుంటూరు పట్టణంలోని బ్రాడీపేట ప్రాంతంలో ఉన్న GDCC బ్యాంక్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

📍కేసు పూర్వాపరాలు: నల్లపాడు GDCC బ్యాంక్ నందు అప్పట్లో మేనేజర్‌గా పనిచేసిన దేవరకొండ అరుణ కుమారి, అప్పటి CEO తొర్లికొండ కృష్ణవేణి, అప్పటి బ్యాంక్ చైర్‌పర్సన్ రాతంశెట్టి. సీతారామాంజనేయులు @ లాల్పురం రాము మరియు అప్పటి కమిటీ సభ్యులు యర్రంశెట్టి ఈశ్వర్ ప్రసాద్, నల్లపాటి రామయ్య, కోటా హరిబాబు, వట్టికొండ కోటేశ్వరమ్మ, దూమావత్ గోవింద నాయక్, వేలిసెల ఏడుకొండలు, కూనిసెట్టి శివ నవీన్, పీటా వెంకటేశ్వరావు తదితరులు కలిసి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

📍వీరు GDCC బ్యాంక్ నియమ నిబంధనలు మరియు కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకింగ్ నియమాలను ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల బ్యాంకుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు నిర్ధారణ అయింది. ఈ అవకతవకలపై గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డివిజినల్ కో-ఆపరేటివ్ సొసైటీ, తెనాలి వారు విచారణ చేపట్టి, అనంతరం డివిజినల్ కో-ఆపరేటివ్ అధికారి శ్రీ కె. శీనా రెడ్డి గారు ఫిర్యాదు చేయగా, నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో

Cr. No.1281/2025 U/S 120(B), 420, 409 r/w 34 IPC కింద కేసు నమోదు చేయబడింది.

దర్యాప్తు వివరాలు: గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును CCS డీఎస్పీ శ్రీ బి.వి. మధుసూదనరావు గారికి అప్పగించగా, వారు అన్ని కోణాలలో దర్యాప్తు చేసి, A-8 నిందితుడు పీటా వెంకటేశ్వరావు పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. అతని కదలికలపై నిఘా ఉంచి, అరెస్ట్ చేయడం జరిగింది.

A-8 నిందితుని వివరాలు: పీటా వెంకటేశ్వరావు,S/o కృష్ణమూర్తి, 62 సం.లు, గాయత్రి ఎవెన్యూ అపార్ట్మెంటు, పటేల్ నగర్ 2వ లైన్, బాపట్ల టౌన్.

ఇతడు నల్లపాడు GDCC బ్యాంక్ పాలకవర్గంలోని ఏడుగురు సభ్యుల కమిటీలో సభ్యుడిగా నామినేట్ చేయబడినాడు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి గారు 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని CCS డీఎస్పీ శ్రీ బి.వి. మధుసూదనరావు గారు పేర్కొన్నారు..

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal Boosts Apple and Horticulture Sector in 2026
Himachal Pradesh continues to strengthen its apple and horticulture sector through initiatives...
By Fathima Safa 2026-07-06 06:37:47 0 159
Andhra Pradesh
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ' బి ' గ్రేడ్
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉన్నత విద్యశాఖ ' బి ' గ్రేడ్ గుర్తింపునిచ్చింది. బుధవారం ఆడిట్...
By Shyamala Yadagiri 2026-04-09 04:55:00 0 282
SURAKSHA
Kona Sasidhar, IAS: Driving Digital Governance Excellence
A Visionary Civil Servant Leading Andhra Pradesh's Digital Transformation, Education Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-13 11:23:48 0 244
Andhra Pradesh
రైతులను వైకాపా మోసం చేసిందన్న కేంద్ర సహాయ మంత్రి
ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి...
By Bharat Aawaz 2025-08-14 10:24:38 0 879
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com