Jagan Mohan Reddy: జగన్‌పై ముద్రగడ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు

0
195

కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి 

జగన్ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ

ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న క్రాంతి

 

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె బార్లపూడి క్రాంతి ఎక్స్ వేదికగా స్పందిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్, తన తండ్రి ముద్రగడపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభద్రతాభావం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 

 

జగన్ రాజకీయ లాభాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి రెడ్లకు అప్పగించి, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతే కాపులు గుర్తొస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే తరహాలో రేపు తన తండ్రి ముద్రగడను కూడా అలా చేయరని గ్యారెంటీ ఉందా? అని ఆమె వ్యాఖ్యానించారు. 

 

తిరుమల లడ్డూ అంశంపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నా, అసలు ఏమీ జరగలేదని ముద్రగడ ఎలా చెప్పగలుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అదేవిధంగా, పాదయాత్ర సమయంలో కాపులకు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా తుంగలో తొక్కారని, అలాంటి వ్యక్తికి తన తండ్రి ముద్రగడ మద్దతివ్వడం ఆశ్చర్యంగా ఉందని క్రాంతి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి...
By Boya Dasthagiri 2026-07-08 09:23:28 0 178
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజీవ్ రెడ్డి
 ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు🙏🙏,,,,,...
By Boya Dasthagiri 2026-03-27 05:16:33 0 332
Andhra Pradesh
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'    -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-03-13 13:11:14 0 211
Andhra Pradesh
చిత్తవుతున్న యువత వీధిన పడుతున్న కుటుంబాలు మద్యం మాఫియా పై జి కోటేశ్వరరావు ఆగ్రహం
 చిత్తవుతున్న యువత.. వీధిన పడుతున్న కుటుంబాలు: మద్యం మాఫియాపై :-  జి కోటేశ్వరరావు...
By Rajini Kumari 2026-04-24 13:15:22 0 199
Telangana
హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరించిన క్రీడాశాఖ మంత్రి : శ్రీహరి
హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పిఎల్) ప్రారంభోత్సవానికి విచ్చేయవలసిందిగా రగ్బీ...
By Avunoori Mahesh 2026-06-08 10:02:18 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com